జాతీయం

National : డేంజర్ జోన్‌‌లో భారత్.. 2027 చివరివరకు ఎల్‌నినో ప్రభావం!

4 నిమిషాల పఠనం

ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా పడనున్నట్టు తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతలు క్రమంగా వేడెక్కుతుండటంతో ఎల్ నినో ఎఫెక్ట్ ఏర్పడింది. దీంతో భారతదేశంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యం అవ్వడంతో పాటు తొందరగా బలహీన పడ్డాయి.ఫలితంగా ఈ ఏడాది వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం తీవ్రంగా పడనున్నట్టు తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రతలు క్రమంగా వేడెక్కుతుండటంతో ఎల్ నినో ఎఫెక్ట్ ఏర్పడింది. దీంతో భారతదేశంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యం అవ్వడంతో పాటు తొందరగా బలహీన పడ్డాయి.ఫలితంగా ఈ ఏడాది వర్షాకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వచ్చే ఏడాది వర్షాకాలం వరకు పరిస్థితులు చక్కబడేలా పరిస్థితులు కనిపించడం లేదు. ఇదే విషయాన్ని వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టంచేస్తున్నారు.

వెంటాడనున్న తీవ్ర కరువు..

ఎల్ నినో ప్రభావం కారణంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా కురవాల్సిన వర్షాలు సమృద్ధిగా పడలేదు. ఫలితంగా కరువు ఛాయలు ఏర్పడ్డాయి.బావులు, చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు అడుగంటిపోతోంది. వచ్చే ఏడాది వర్షాకాలం వర్షాలు సకాలంలో కురవకపోతే ద్రవ్యోల్భణం గరిష్టస్థాయికి చేరనుంది. ఇప్పటికే 6 నుంచి 8 శాతానికి ఇన్ ఫ్లేషన్ పెరిగింది.కూరగాయాలు, ఉప్పులు, పప్పులు, ధాన్యం, పండ్లు, వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

దీనికి తోడు రానున్న రోజుల్లో వాతావరణ మార్పులు,తీవ్రమైన ఎండలు, మరింత కరవు పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో నీరు లేక పంటలు పండక ధరలు పెరిగి సామాన్యుడి జీవనం అతలాకుతలం అవ్వడం ఖాయంగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎల్‌నినో తాజాగా పరిస్థితులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కీలక హెచ్చరికలు చేసింది. 2027 సెప్టెంబర్ వరకు ప్రపంచవ్యాప్తంగా ‘ఎల్ నినో’ ప్రభావం కొనసాగే అవకాశం ఉందని స్పష్టంచేసింది.

డేంజర్ జోన్‌లో భారత్..

అంతేకాకుండా, 'హై రిస్క్ జోన్' (అధిక ముప్పు ఉన్న దేశాల జాబితా)లో భారత్‌ను చేర్చింది. ఎల్‌నినో పరిస్థితుల కారణంగా దేశంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడంతో పాటు వర్షపాతంలో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకునే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరికలు చేశారు. వేసవిలో వడగాల్పులు, తాగునీటి ఎద్దడి, వ్యవసాయ ఉత్పత్తులపై ప్రభావం పడుతుందని పేర్కొంది. వాతావరణ మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ ముందస్తు హెచ్చరికలు చేసింది. అందుకోసం ఆయా దేశాలు అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.

#Elnino#india#WHO#prewarning#no rains#next year end#international#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి