అంతర్జాతీయం

Delhi Air Pollution: పటాకుల దెబ్బకు ఊపిరాడని ఢిల్లీ..!

5 నిమిషాల పఠనం

Delhi Air Pollution: దీపావళి సంబరాల వేళ దేశ రాజధాని ఢిల్లీని విషపూరితమైన దట్టమైన పొగ కమ్మేసింది. పండుగ రాత్రి నిబంధనలను బేఖాతరు చేస్తూ రాత్రంతా భారీగా బాణసంచా కాల్చడంతో నగరం ఒక్కసారిగా 'గ్యాస్ చాంబర్'గా మారిపోయింది.

Delhi Air Pollution: దీపావళి సంబరాల వేళ దేశ రాజధాని ఢిల్లీని విషపూరితమైన దట్టమైన పొగ కమ్మేసింది. పండుగ రాత్రి నిబంధనలను బేఖాతరు చేస్తూ రాత్రంతా భారీగా బాణసంచా కాల్చడంతో నగరం ఒక్కసారిగా 'గ్యాస్ చాంబర్'గా మారిపోయింది. గాల్లో కాలిన మందుగుండు ఘాటు వ్యాపించి, రోడ్లపై కనీసం వీధి దీపాలు కూడా స్పష్టంగా కనిపించనంతగా పొగమంచు అలుముకుంది. తీవ్ర వాయు కాలుష్యంతో కంటిచూపు మందగించడమే కాకుండా, ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా మారడంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రభుత్వం తక్షణమే 1 నుంచి 5వ తరగతి వరకు ప్రైమరీ స్కూళ్లను బంద్ చేసి, ఆన్‌లైన్ మోడ్‌లోకి మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

రికార్డు స్థాయిలో AQI..

ఢిల్లీ వ్యాప్తంగా సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 373గా నమోదై 'వెరీ పూర్' కేటగిరీకి పడిపోయింది. పలు ప్రాంతాల్లోనైతే గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. సోనియా విహార్‌లో రికార్డు స్థాయిలో గరిష్టంగా 463 AQI నమోదు అయ్యింది. మురారి క్రాసింగ్ ఏరియాలో 452 AQIగా, జహంగీర్‌పురి పరిధిలో 447 AQI, వివేక్ విహార్‌లో 447 AQI, రోహిణి పరిధిలో 442 AQI నమోదు అయ్యింది. పీతంపుర, బురారి, మయూర్ విహార్‌లతో పాటు లుటియన్స్ ఢిల్లీలో సైతం భారీ ఎత్తున పటాకులు పేల్చడంతో గాలి పీల్చడమే ప్రాణాంతకంగా మారింది.

చిన్నారుల శ్వాసపై దెబ్బ.. ఆన్‌లైన్‌లోకి తరగతులు!

ఈ విషపూరిత వాయువులు చిన్నారుల ఊపిరితిత్తులపై తీవ్ర దుష్ప్రభావం చూపే ప్రమాదం ఉండటంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న విద్యార్థులందరికీ సూల్స్ బంద్ చేసి, ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. చిన్నపిల్లల లంగ్స్ చాలా సున్నితంగా ఉండటం వల్ల ఈ కాలుష్యాన్ని పీలిస్తే దగ్గు, జలుబు, కళ్ల మంటలతో పాటు దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యలు వచ్చే ముప్పు ఉందని వైద్య నిపుణులు హెచ్చరించడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఆంక్షలు తుంగలోకి..

సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే, అదీ తక్కువ కాలుష్యాన్ని వెలువరించే గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలన్న రూల్స్ క్షేత్రస్థాయిలో ఎక్కడా అమలు కాలేదు. పక్కనే ఉన్న ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి దొంగచాటుగా భారీగా మందుగుండు సామాగ్రిని నగరంలోకి తరలించి రాత్రంతా విచ్చలవిడిగా పేల్చారు. ఫలితంగా నేషనల్ క్యాపిటల్ కాస్తా 'పొల్యూషన్ క్యాపిటల్'గా మారిపోయిందని స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రుల్లో శ్వాసకోశ బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని పౌరులు డిమాండ్ చేస్తున్నారు.

#Delhi Air Pollution#Delhi AQI#Diwali Pollution#Firecracker Pollution#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి