రాజకీయాలు

BRS : ఇందిరమ్మ ఇళ్లతో అప్పుల పాలవుతున్న ప్రజలు : మాజీ మంత్రి ఎర్రబెల్లి

5 నిమిషాల పఠనం

అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లతో ప్రజలు అప్పుల పాలవుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఊర్లల్లో కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడని, దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా నువ్వు, నీ మంత్రులు నాతో రండి’ అంటూ సవాల్ విసిరారు.

అధికార కాంగ్రెస్ పార్టీ తీరుపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇళ్లతో ప్రజలు అప్పుల పాలవుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ‘ఊర్లల్లో కాంగ్రెస్ పార్టీని మెచ్చుకుంటున్నారని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా చెప్తున్నాడని, దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా నువ్వు, నీ మంత్రులు నాతో రండి’ అంటూ సవాల్ విసిరారు.

ప్రజలు ఎట్ల తిడుతున్నారో చూపిస్తానని చెప్పారు. అసలు ఏం చేశావని నిన్ను ప్రజలు మెచ్చుకుంటారు? అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వ హయాంలో భూమి కొనిచ్చి రూ.20 లక్షలతో ఇండ్లు కట్టించామని, మీ ఇందిరమ్మ ఇండ్ల వల్ల ప్రజలందరూ అప్పుల పాలవుతున్నారని అన్నారు. గత ఎన్నికల సమయంలో పెన్షన్ రూ.4వేలకు పెంచుతామని అన్నారని ఏమైందని అడిగారు. మహిళలకు రూ.2500 ఇస్తలేరని, విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పారని..కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ బంద్ పెట్టారని మండి పడ్డారు. తులం బంగారం ఏమైందని నిలదీశారు. ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చారని.. ఫ్రీ గ్యాస్ కూడా ఇవ్వడం లేదని.. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పేరిట మగవాళ్లకు టికెట్ రేట్లు అడ్డగోలుగా పెంచారని.. ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందంటే ఎందుకు రాదని ప్రశ్నించారు.

ఇదిలాఉండగా, మాజీ మంత్రి చెప్పిన విధంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు అప్పుల పాలు అవుతున్నారని ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ప్రభుత్వం అందించే ఆర్థిక సాయం ప్రస్తుత నిర్మాణ ఖర్చులకు సరిపోకపోవడం, సకాలంలో బిల్లులు విడుదల కాకపోవడమే దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

రూ.5 లక్షల ఆర్థిక సాయం సరిపోవడం లేదు..

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తోంది. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం బేస్‌మెంట్ స్థాయి నుంచి పైన స్లాబ్ వేసి, ఇల్లు పూర్తి చేయడానికి సరిపోవడం లేదు. ఇటుకలు, సిమెంట్, ఇసుక, ఐరన్, కూలీల ఖర్చులు భారీగా పెరగడంతో మొత్తం నిర్మాణ వ్యయం రూ.8 లక్షల నుండి రూ.10 లక్షల వరకు అవుతోంది. ఈ అదనపు భారాన్ని భరించడానికి లబ్ధిదారులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తోంది.

ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో (బేస్‌మెంట్, రూఫ్ లెవెల్, స్లాబ్) ఉన్నప్పుడు ప్రభుత్వం ఇచ్చే నిధులు సకాలంలో లబ్ధిదారుల ఖాతాల్లో జమ కావడం లేదని లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు ఆగిపోకుండా చూసుకోవడానికి అధిక వడ్డీలకు చేతిబదుళ్లు, అప్పులు తెచ్చి నిర్మాణాన్ని కొనసాగిస్తుటంతో వడ్డీల భారం పెరుగుతోంది. ప్రభుత్వ బిల్లులు వచ్చేసరికి నెలల సమయం పడుతుండటంతో, అంతవరకు తెచ్చిన అప్పులపై వడ్డీలు పేరుకుపోయి నిరుపేద కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని విమర్శలొస్తున్నాయి.కాగా, ఇందిరమ్మ ఇండ్ల ప్రభుత్వ సాయం సరిపోవడం లేదని,మరింత పెంచాలని గతంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

#BRS#Congress#errabelli dayakar rao#indiramma houses#debt#people#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి