క్రైమ్

Crime : నల్లగా ఉన్నావని భర్త వేధింపులు.. భార్య ఏం చేసిందంటే?

3 నిమిషాల పఠనం

దాంపత్య జీవితంలో వేధింపులు, అవమానాలు తాళలేక మరో వివాహిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పెళ్లయిన నాటి నుంచి అటు భర్త అండగా లేకపోవడంతో పాటు పదే పదే రంగు గురించి అవహేళన చేయడం, అవమానించడం, అత్తమామలు సైతం కేర్ చేయకపోవడంతో ఆ వివాహిత ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది.

దాంపత్య జీవితంలో వేధింపులు, అవమానాలు తాళలేక మరో వివాహిత షాకింగ్ నిర్ణయం తీసుకుంది. పెళ్లయిన నాటి నుంచి అటు భర్త అండగా లేకపోవడంతో పాటు పదే పదే రంగు గురించి అవహేళన చేయడం, అవమానించడం, అత్తమామలు సైతం కేర్ చేయకపోవడంతో ఆ వివాహిత ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. ఫలితంగా ఆమె కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు.

వివరాల్లోకివెళితే.. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో గోపాల్ మిశ్రా అనే వ్యక్తితో రుచి మిశ్రాకు వివాహం జరిగింది. అయితే, పెళ్లయిన నాటి నుంచి నల్లగా ఉన్నావని ఆమె భర్త వేధింపులకు గురిచేయసాగాడు.దీనికి తోడు వరకట్న వేధింపులకు సైతం గురిచేసినట్టు సమాచారం.మొదటి నుంచి భర్త వ్యవహారం, అత్తింటి వారి వేధింపులను ఓపికగా భర్తిస్తూ వచ్చిన రుచి... టార్చర్ ఎక్కువ కావడంతో అత్తింటిలోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

విషయం తెలుసుకున్న రుచి పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. పెళ్లైన 9 నెలలకే అత్తారింట్లో తన కూతురు ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడిందని, దీనికి కారణం ఆమె భర్త,అత్తింటి వారే అని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పెళ్లైనప్పటి నుంచి రుచిని గోపాల్ నల్లగా ఉన్నావని వేధింపులకు గురిచేశాడని, కట్నం కోసం కూడా వేధించారని ఆరోపించారు. రుచిని ఆమె భర్త తరచూ కొట్టేవాడని కూడా ఆమె కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇది ఆత్మహత్య కాదని భర్త, అత్తారింటోళ్లు నిత్యం వేధించి రుచిని చంపారని కుటుంబ సభ్యుల ఆందోళన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కాన్పూర్ పోలీసులు తెలిపారు. రుచి భర్త, కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.

#husband harrassment#Khanpur Uttarpradesh#wife suicide#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి