తెలంగాణ

Hyderabad : విచారణకు రండి.. వీసీ అల్డాస్ జానయ్యకు మహిళా కమిషన్ నోటీసులు

5 నిమిషాల పఠనం

మహిళా ప్రొఫెసర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటనలో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్యకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని అందులో పేర్కొంది. అల్డాస్ జానయ్య లైంగికంగా వేధించాడని మహిళా ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.

ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య తనను లైంగికంగా వేధిస్తున్నాడని అసిస్టెంట్ ప్రొఫెసర్ తేజశ్రీ ఆరోపించిన విషయం తెలిసిందే. పీహెచ్‌డీ డిప్యూటేషన్ పొడిగింపు అనుమతి కోసం వీసీ వద్దకు వెళ్తే అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా లైంగిక వేధింపులకు గురిచేశారని శనివారం ఆమె సొమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సంచలన ఆరోపణలు చేశారు. అర్ధరాత్రి ఫోన్ కాల్స్ చేసేవారని, వ్యక్తిగతంగా తనను కలవాలని, భర్తను వదిలి తనతో ఉండాలని ఒత్తిడి చేస్తున్నారని కంటతడి పెట్టారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో మీడియా ముందుకు వచ్చానని చెప్పారు.

తిరగబడ్డ విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్..

ఇదిలాఉండగా, రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ అల్డాస్ జానయ్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ టీచింగ్ స్టాఫ్, విద్యార్థినీవిద్యార్థినులు నిరనస బాట పట్టారు. వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్యపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అని విద్యార్థినులు ప్రశ్నించారు. మహిళా ప్రొఫెసర్‌కు అన్యాయం జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదు? నిలదీశారు. లైంగిక వేధింపులకు గురైన మహిళా ప్రొఫెసర్‌కు న్యాయం చేయాలని రాజేంద్రనగర్‌లోని అగ్రికల్చర్ యూనివర్సిటీలో TASA అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసనకు దిగారు.

మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి...

వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక మరో మహిళా ప్రొఫెసర్ కంటతడి పెట్టుకున్నట్టు తెలిసింది.మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని అల్డాస్ జానయ్య వేధించారని బాధితురాలి ఆరోపించారు. డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం దక్కడం లేదన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తే విధుల నుంచి తొలగించాలి కానీ వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్యను ఈ ప్రభుత్వం కాపాడుతుందని, ప్రభుత్వం తరపున అల్డాస్ జానయ్యపై ఒక్క స్టేట్‌మెంట్ కూడా ఎందుకు ఇవ్వడం లేదు? అని బాధితురాలి పక్షాన తోటి మహిళా ప్రొఫెసర్ నిలదీశారు.

Hyderabad : విచారణకు రండి.. వీసీ అల్డాస్ జానయ్యకు మహిళా కమిషన్ నోటీసులు

జానయ్యకు నోటీసులు..

మహిళా ప్రొఫెసర్లను లైంగికంగా వేధించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఘటనలో రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్యకు మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని అందులో పేర్కొంది. అల్డాస్ జానయ్య లైంగికంగా వేధించాడని మహిళా ప్రొఫెసర్ చేసిన ఫిర్యాదు మేరకు తెలంగాణ స్టేట్ ఉమెన్ కమిషన్ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.

#PJATU#vc aldas janaiah#women commission notice#sexual harrassment#hyderabad#Students protest#Rajendranagar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి