తెలంగాణ

BRS : పొంగులేటి, పీసీసీ చీఫ్, పెద్దపల్లి ఎంపీకి బీఆర్ఎస్ నోటీసులు

రచన: Kumar••4 నిమిషాల పఠనం

కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ తన ఫాంహౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, రెవెన్యూ, గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణలకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ నోటీసులు జారీ చేసింది.

రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద నిరాధార ఆరోపణలు చేసిన వారిపై బీఆర్ఎస్ లీగల్ టీం ఘాటుగా రియాక్ట్ అయ్యింది. కొండపోచమ్మ సాగర్ నీటిని కేసీఆర్ తన ఫాంహౌస్‌కు మళ్లించారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న టీపీసీసీ చీఫ్ మహేశ్‌ కుమార్‌ గౌడ్‌, రెవెన్యూ, గృహ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణలకు బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ నోటీసులు జారీ చేసింది. బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రెటరీ, లీగల్‌ సెల్‌ ఇన్‌‌చార్జి సోమ భరత్‌ కుమార్‌ నోటీసులు జారీ చేశారు.

ఇదే విషయంలో ‘వెలుగు’ దినపత్రిక యాజమాన్యం, ఎడిటర్‌కు సైతం నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది.ఎందుకంటే సదరు దినపత్రికలో వచ్చిన కథనాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆరోపించింది.ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు నోటీసులు పంపించారు.

తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో చేసిన సంబంధిత పోస్టులను తక్షణమే బేషరతుగా తొలగించి, తప్పుడు ప్రచారాన్ని ఉపసంహరించుకోవాలని బీఆర్‌ఎస్‌ లీగల్‌ సెల్‌ డిమాండ్‌ చేసింది. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. నోటీసులకు స్పందించని పక్షంలో పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం తదుపరి న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ లీగల్ సెల్ తెలిపింది.

ఇదిలాఉండగా, ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో వర్షాలు లేక రైతులకు సాగు నీరు అందడం లేదని, రేవంత్ సర్కార్ సాగునీరు అందించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, విఫలం అయ్యిందని బీఆర్ఎస్ నేతలు గత కొంతకాలంగా విమర్శిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే కేసీఆర్ రంగనాయక్ సాగర్ నుంచి అక్రమంగా నీటిని తన ఫాంహౌస్‌కు మళ్లిస్తున్నారని కాంగ్రెస్ నేతలు కౌంటర్ అటాక్ ప్రారంభించారు. దీంతో వారికి బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు పంపించింది.

#BRS legal team#notices#Congress leaders#ponguleti#tpcc cheif mahesh goud#mp vamshi krishna#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి