టాప్ న్యూస్

TG : సొమ్ము సింగరేణిది.. సోకు సర్కారుది?

రచన: Kumar••7 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రభుత్వం చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సింగరేణిపై ఇప్పటికే పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో లాభాల్లో నడిచిన సంస్థను ఇప్పుడు నష్టాలబాటలోకి తీసుకెళ్లేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం చర్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సింగరేణిపై ఇప్పటికే పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో లాభాల్లో నడిచిన సంస్థను ఇప్పుడు నష్టాలబాటలోకి తీసుకెళ్లేందుకు రేవంత్ సర్కార్ ప్రయత్నిస్తోందని, ఆ తర్వాత లాభాలు రావడం లేదని చూపించి ప్రయివేటీకరించేందుకు కుట్ర పన్నుతోందని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తున్నది.ఎందుకంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లాభాలే తగ్గడమే ఇందుకు ప్రధాన కారణం. దీనికి తోడు సంస్థ లాభాల్లో కార్మికులకు తగిన వాటా దక్కలేదని విమర్శలు గుప్పించింది. కార్మికులు సైతం తమకు దక్కిన లాభాల వాటాపై అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం.

రాబడి గణనీయంగా తగ్గుదల..

కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన కొత్తలో సింగరేణి సంస్థ లాభాలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 2,420 కోట్లుగా ఉంది. ఆ తర్వాత 2024–25 ఆర్థిక ఏడాదిలో చూసుకుంటే లాభం రూ. 2,360 కోట్లుగా నమోదైంది. అనగా ఏడాది వ్యవధిలో రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది. ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి మూడో ఏడాది పూర్తి చేసుకోనున్న తరుణంలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం రూ. 1,754 కోట్లుగా నమోదైంది. అనగా 2024–25తో పోలిస్తే రూ. 606 కోట్లు నష్టం వాటిల్లింది. సుమారు 25.7% తగ్గుదల నమోదైంది.

పేరుకుపోతున్న బకాయిలు..

సింగరేణి ఉత్పత్తి చేసిన నాణ్యమైన బొగ్గును విద్యుత్ సంస్థలకు సరఫరా చేస్తున్నది. ఆ సంస్థల నుంచి బిల్లులు సకాలంలో రాకపోతే సింగరేణి నగదు లభ్యతపై ఒత్తిడి ఏర్పడుతోంది.ఫలితంగా బకాయిలు రాక సింగరేణి తన సొంత నిధులను అత్యవసరంగా ఖర్చు చేయాల్సి వస్తోంది.దాంతో ఆర్థిక ఒత్తిడి పెరుగుతోంది. అది కాస్త సంస్థ లాభాలపై ప్రభావితం చూపుతోంది.విద్యుత్ సంస్థల బకాయిలను సింగరేణికి చెల్లించేందుకు ప్రభుత్వం సకాలంలో చొరవ చూపకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 2014లో గత బీఆర్ఎస్ హయాంలో సింగరేణికి రావాల్సిన బకాయిలు రూ.2 వేల కోట్ల నుంచి రూ.7వేల కోట్లకు చేరుకోగా.. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో సుమారు రూ.21వేల కోట్లకు పెరిగాయని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.

నిధుల బదిలీ..

సింగరేణి నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర అవసరాల కోసం వినియోగిస్తున్నదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో సింగరేణి నిధులతో ఉద్యోగుల బకాయిలు,ఇతర స్కీమ్స్ అమలు చేసినట్టు జోరుగా ప్రచారం జరిగింది.బీఆర్ఎస్ నేతలు కూడా ఈ విషయంలో తీవ్ర విమర్శలు గుప్పించారు. సింగరేణి నిధులను రేవంత్ సర్కార్ ప్రభుత్వ అసవసరాల కోసం వినియోగించడం వలన అసలైన కార్మికులకు నష్టం వాటిల్లుతోందని సమాచారం.కార్మికులు, సంస్థకు నష్టం కలుగకుండా ఉండాలంటే విద్యుత్ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది.

TG : సొమ్ము సింగరేణిది.. సోకు సర్కారుది?

సింగరేణి సొమ్ముతో ప్రచారమా?

ఇదిలాఉండగా, సింగరేణి సొమ్మును రేవంత్ సర్కార్ పబ్లిసిటీకి వినియోగిస్తున్నదని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. సింగరేణిలో వృథా ఖర్చులపై పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దసరా శుభాకాంక్షల పేరిట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫొటోతో సింగరేణి సంస్థ కరపత్రాలు ప్రింట్ చేయించినట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ మూడు రంగుల బార్డర్‌తో నాలుగు పేజీల కరపత్రాలను ముద్రించినట్టు తెలిసింది. ఇందుకు రూ.లక్షలు వెచ్చించినట్టు తెలుస్తోంది.

కార్మికుల సంక్షేమంపై కోతలు పెడుతున్న సర్కార్.. ప్రచారానికి మాత్రం భారీగా ఖర్చు చేస్తోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పండుగ సందర్భంగా కార్మికులకు కనీసం స్వీట్లు ఇవ్వని పంచని యాజమాన్యం.. కరపత్రాలకు మాత్రం డబ్బు ఎక్కడి నుంచి తెచ్చిందని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. యాజమాన్యం తీరుపై టీబీజేకేఎస్‌ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.కరపత్రాల ఖర్చులపై వివరణ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.సొమ్ము ఒకరది, సోకు మరొకరిది అంటే ఇదేనేమో అంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.

#singareni#pamplets#batti vikramarka#telangana#Swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి