సినిమా

Bloody Romeo: నానికి కావాల్సింది ఇప్పుడు ఇలాంటి సినిమానేనా!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Bloody Romeo: నేచురల్ స్టార్ నాని కి గత కొంతకాలంగా హిట్స్ దక్కడం లేదు. పాన్ ఇండియా క్రేజ్ తో మాస్ అండ్ యాక్షన్ సినిమాలను చేస్తున్నాడు. సినిమా రిలీజ్‌కి ముందు ప్రమోషనల్ కంటెంట్‌తో భారీ హైప్ క్రియేట్ అవుతోంది. కానీ, ఆ హైప్‌కి తగ్గట్టుగా సినిమా ఉండటం లేదు. అంతకముందు హిట్ 3..ఇటీవల వచ్చిన ది ప్యారడైజ్ సినిమాలు నానికి షాకిచ్చాయి. దీంతో, వెంటనే బ్లడీ రోమియో సినిమాను పట్టాలెక్కించాడు.

గ్యాప్ వస్తే కష్టమే:

ఇప్పుడున్న పరిస్థితుల్లో మన హీరోలకి ఏమాత్రం గ్యాప్ వచ్చినా కష్టమే. అసలే, ఓటీటీల ప్రభావం ఎక్కువవుతోంది. మేకింగ్ కోసం డైరెక్టర్స్ ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. కాస్త భారీ బడ్జెట్ సినిమా అయితే అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కావడం లేదు. భారీ సెట్స్, వీఎఫెక్స్, గ్రాఫిక్స్ వల్ల సినిమాలను చెప్పిన సమయానికి పూర్తి చేయలేకపోతున్నాయి. దీంతో, మిడ్ రేంజ్ హీరోల సినిమాలకి బిజినెస్ పరంగా ఇబ్బందులు వస్తున్నాయి.

వరుసగా ఫ్లాప్స్ వస్తే అమాంతం మార్కెట్ పడిపోవడమే కాదు, ఓటీటీల డీల్ కూడా వెనక్కి వెళుతోంది. ఇటీవల భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఆదర్శకుటుంబం, ఫైజీ సినిమాలు వాయిదా పడ్డాయి. దీంతో, మళ్ళీ ఆదర్శకుటుంబం సినిమాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలంటే ఓటీటీ డీల్ క్లోజ్ కావడం లేదు. ముందు కుదుర్చుకున్న ఒప్పందంలో కొంత మేర తగ్గించాలనే ప్రతిపాదన రావడంతో ఇద్దరి మధ్య చర్చలు పూర్తికాక వెంకీ ఆదర్శకుటుంబం విడుదల ఆగిపోయింది.

ఇలాంటి, క్లిష్ట పరిస్థితుల్లో వరుస ఫ్లాపుల్లో నాని గనక సినిమాలను వెంటనే లైన్‌లో పెట్టకపోతే అతని మార్కెట్ దెబ్బతినే ప్రమాదముంది. అందుకే, సుజీత్ దర్శకత్వంలో చేస్తోన్న బ్లడీ రోమియో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకువచ్చాడు. మొదటి షెడ్యూల్ ఢిల్లీలో మొదలైంది. వారం రోజుల షెడ్యూల్ తర్వాత హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలవుతుందట. ఓజీ సినిమాతో భారీ హిట్ అందుకున్న సుజీత్ దర్శకుడు కావడంతో నానికి ఇప్పుడు హిట్ దర్శకుడిగా ఇతనే కనిపిస్తున్నాడు. ఇలాంటి సినిమానే ఇప్పుడు నానికి కావాల్సింది అని ఇండస్ట్రీలో కూడా చెప్పుకుంటున్నారు.

#Bloody Romeo#Nani#Sujeeth#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి