తెలంగాణ

TG : కాళేశ్వరంలో జలకళ.. రాష్ట్రంలో కరువు నేల!

రచన: Kumar•••5 నిమిషాల పఠనం

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీరు అడుగంటుతోంది. వర్షాలు లేకపోవడంతో వేసవికాలం వరకు నీరు ఉంటుందా? లేదా? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.యాసంగి సాగుకు నీరు ఇవ్వలేమని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది.

రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం కారణంగా జలాశయాలు, ప్రాజెక్టుల్లో నీరు అడుగంటుతోంది. వర్షాలు లేకపోవడంతో వేసవికాలం వరకు నీరు ఉంటుందా? లేదా? అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.యాసంగి సాగుకు నీరు ఇవ్వలేమని సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ఉన్న నీటిని కేవలం తాగు అవసరాలు తీర్చేందుకు వినియోగిస్తామని రాష్ట్ర మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. అయితే, సమ్మర్‌లో మాదిరి ఎండలు దంచికొడుతుండటంతో మరో 50 నుంచి 60 రోజుల్లో ప్రాజెక్టుల్లోని నీరు పూర్తిగా డెడ్ స్టోరేజీకి చేరుకుంటుందని ఇరిగేషన్ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఓవైపు వర్షాలు లేక ఎగువప్రాంతాల నుంచి ప్రాజెక్టుల్లోకి నీరు రాకపోవడంతో రాష్ట్రంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొన్నాయి. చెరువులు, కుంటలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే చిన్న చెరువుల్లో నీరు పూర్తిగా అడుగంటుకుపోయినట్టు సమాచారం. సాగు నీరు లేక పంటలు ఎండిపోయి భూమి నెర్రలు వారుతోంది. పశువులకు దానా, తాగు నీటికి కూడా గ్రామాల్లో ఇబ్బందులు ఏర్పడినట్టు తెలుస్తోంది.కరువు ఛాయలు రాష్ట్రాన్ని ఇప్పటికే కమ్మేసినట్టు చర్చ జరుగుతోంది.

వృథాగా గోదావరి జాలాలు..

ఇదిలాఉంటే,కాళేశ్వరం గోదావరి జలాలతో కళకళలాడుతోంది.అక్కడ నీరు పుష్కలంగా ఉండటంతో నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాళేశ్వరం దగ్గర గోదావరి జలాలు వృథాగా పోతున్నా రేవంత్ సర్కార్ పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తమకు సాగు నీరు ఇవ్వకుండా గోదావరి జలాలను వృథాగా కిందకు వదలడంపై మండిపడుతున్నారు.

రిపేర్లు ఎందుకు చేయలేదు..

ప్రస్తుతం కాళేశ్వరం కన్నెపల్లి వద్ద గోదావరి జలాలు దిగువకు ప్రవహిస్తున్నాయి. 22 వేల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నట్టు తెలిసింది. అక్కడ రోజుకు దాదాపు 1.9 టీఎంసీల నీరు ప్రవాహిస్తుండగా.. రేవంత్ సర్కార్ మాత్రం సాగుకు నీళ్లు లేవంటూ చెబుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అందుబాటులో ఉన్న జలాలను సాగు కోసం ఎందుకు వినియోగించడం లేదని రైతులు, ప్రతిపక్ష నేతలు నిలస్తున్నారు.

రేవంత్ సర్కారుకు అన్నదాతల మీద అంత ప్రేమ ఉంటే.. అధికారంలోకి వచ్చి మూడేండ్లు అయినా ఎందుకు మేడిగడ్డ బ్యారేజీని రిపేర్ చేయలేదని..విచారణల పేరుతో కాలయాపన చేసి తీరా కరువు పరిస్థితులు నెలకొన్న సమయంలో రిపేర్లు చేయిస్తామని హడావుడి చేస్తే దిగువకు వెళ్లిపోయిన నీటిని ఎలా తెస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఇదిలాఉండగా, కాళేశ్వరంలోని కన్నెపల్లి వద్ద ఇప్పుడు కూడా నీరు వృథాగా పోతుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు.రేవంత్ సర్కార్‌కు నీటిని ఎత్తిపోయడం చేతగాకపోతే తమకు అప్పగిస్తే నీళ్ళు ఎత్తిపోసి చూపిస్తామని మరోసారి ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..కాళేశ్వరం నీటిని ఎత్తిపోసి అన్నదాతలకు సాగు నీరు అందించాలని హితవు పలికారు.

#kaleshwaram#godavari water#congress#BRS#wastage#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి