తెలంగాణ

DK Aruna: మహిళా ఎమ్మెల్యేలను అవమానిస్తారా? సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలి- డీకే అరుణ

రచన: NK3 నిమిషాల పఠనం

DK Aruna: అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా హేయమైందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహిళా శాసనసభ్యులపై ఎవరి ఆదేశాల ప్రకారం పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆమె ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ వారిపై చర్యలు తీసుకోవాలని సభలో చర్చించారు.

DK Aruna: అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు చాలా హేయమైందని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహిళా శాసనసభ్యులపై ఎవరి ఆదేశాల ప్రకారం పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆమె ప్రశ్నించారు.

అసెంబ్లీ స్పీకర్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ వారిపై చర్యలు తీసుకోవాలని సభలో చర్చించారు. అలాగే మహిళా శాసనసభ్యులతో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా చర్చ పెట్టాలని రేవంత్ సర్కార్ ను డీకే అరుణ డిమాండ్ చేశారు.

మహిళా ఎమ్మెల్యేలను అవమానించడం.. వారి చీర లాగడం, జట్టు పట్టుకుని ఈడ్చడంపై నోరు విప్పకపోవడం దారుణమన్నారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే యాక్షన్ తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అని వాపోయారు.

''మహిళా ఎమ్మెల్యేలకు అగౌరవం జరిగింది. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రులుగా పని చేసిన వారు. పార్టీలు వేరైనా సాటి ఎమ్మెల్యేలను గౌరవించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిపై ఉంటుంది. ఒకరికి ఒక న్యాయం, మరొకరికి ఒక న్యాయం సరైంది కాదు. మహిళ పట్ల మరింత గౌరవం ఉండాలి.

అసెంబ్లీలోని మహిళా ఎమ్మెల్యేలకు గౌరవం లేకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఏంటి..? ఇది పార్టీలకు సంబంధం లేని అంశం. ఒక మహిళగా, పార్లమెంట్ సభ్యురాలిగా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలి. పోలీసులపై చర్యలు తీసుకోవాలి'' అని డీకే అరుణ డిమాండ్ చేశారు.

#DK Aruna#Telangana Assembly#Cm Revanth Reddy#Brs Women Mlas#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి