సినిమా

YouTuber Rama Nandu : నా తప్పేం లేదు.. అంతా ఆయనే చేశాడు : యూట్యూబర్ నందన

రచన: Mahesh3 నిమిషాల పఠనం

వివాదాస్పద యూట్యూబర్‌ రమా నందనను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. కన్సల్టెన్సీ పేరుతో సాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంపై ఆమెను అధికారులు దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే విచారణ సమయంలో ఆమె ఇచ్చిన సమాధానాలపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

YouTuber Rama Nandu : వివాదాస్పద యూట్యూబర్‌ రమా నందనను పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. కన్సల్టెన్సీ పేరుతో సాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంపై ఆమెను అధికారులు దాదాపు మూడు గంటల పాటు ప్రశ్నించినట్లు సమాచారం. అయితే విచారణ సమయంలో ఆమె ఇచ్చిన సమాధానాలపై పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కన్సల్టెన్సీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, ఇతర కార్యకలాపాలను తన భర్త మధుకర్‌ మాత్రమే పర్యవేక్షిస్తారని రమా నందన చెప్పినట్లు సమాచారం. తనకు వాటితో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేదని పేర్కొంటూ, తాను కేవలం యూట్యూబ్‌ వీడియోలకే పరిమితమవుతానని వివరించినట్లు తెలుస్తోంది.

అయితే ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్‌ ఛానెల్‌లోని వీడియోలు, అందులో చేసిన ప్రమోషన్లపై పోలీసులు ప్రత్యేకంగా ప్రశ్నలు అడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆమె స్వయంగా చేసిన కామెంట్స్, ప్రచారానికి సంబంధించిన విషయాలపై వివరణ కోరినప్పటికీ ఆమె నుంచి వాటికి స్పష్టమైన సమాధానాలు రాలేదని తెలుస్తోంది.

విచారణలో కీలక ప్రశ్నలకు ఆమె సమాధానాలు దాటవేస్తున్నారనే అనుమానంతో పోలీసులు తదుపరి దర్యాప్తుపై దృష్టి సారించారు. ఈ క్రమంలో ఈ నెల 16న మరోసారి ఆమెను విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణలో ఆమె భర్త మధుకర్‌ పాత్రతో పాటు కన్సల్టెన్సీ వ్యవహారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, యూట్యూబ్‌ వీడియోల వెనుక ఉన్న ఉద్దేశాలపై పోలీసులు మరింత లోతుగా ఆరా తీసే అవకాశం ఉందని చెబుతున్నారు.

#Rama Nandu#YouTuber Rama Nandu#Rama Nandu Case#Rama Nandana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి