క్రీడలు

Asian Games 2026: ఆర్చరీలో భారత్‌ జోరు.. రికర్వ్‌లో తొలి స్వర్ణం!..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు మరోసారి సత్తా చాటారు. ఇప్పటికే కాంపౌండ్‌ ఆర్చరీలో వరుసగా స్వర్ణాలు సాధించిన భారత బృందం.. ఇప్పుడు రికర్వ్‌ విభాగంలోనూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్లు మరోసారి సత్తా చాటారు. ఇప్పటికే కాంపౌండ్‌ ఆర్చరీలో వరుసగా స్వర్ణాలు సాధించిన భారత బృందం.. ఇప్పుడు రికర్వ్‌ విభాగంలోనూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు ఆసియా క్రీడల మహిళల రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం కావడం విశేషం.

మహిళల రికర్వ్‌ టీమ్‌ ఫైనల్‌లో అంకితా భకత్‌, కీర్తి శర్మ, కుంకుమ్‌ మొహద్‌ త్రయం అద్భుతంగా పోరాడింది. ఎదురుగా ఉన్నది ఆసియా ఆర్చరీలోనే బలమైన దక్షిణకొరియా జట్టు. పది సార్లు ఆసియా క్రీడల ఛాంపియన్‌గా నిలిచిన కొరియా జట్టుపై భారత అమ్మాయిలు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా 5-3తో కొరియాను ఓడించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నారు.

అంతకుముందు సెమీఫైనల్లోనూ భారత్‌ దుమ్మురేపింది. చైనాను 5-1 తేడాతో ఓడించి తొలిసారి ఆసియా క్రీడల మహిళల రికర్వ్‌ టీమ్‌ ఫైనల్‌కు చేరిన భారత అమ్మాయిలు.. ఫైనల్‌లోనూ అదే జోరును కొనసాగించారు. ఇక ఈ ఆసియా క్రీడల్లో ఆర్చరీ ఇప్పటికే భారత్‌కు బంగారు పంట పండిస్తోంది. సెప్టెంబర్‌ 30న పురుషుల కాంపౌండ్‌ టీమ్‌, మహిళల కాంపౌండ్‌ టీమ్‌, మిక్స్‌డ్‌ కాంపౌండ్‌ టీమ్‌ ఈవెంట్లలో భారత్‌ మూడు స్వర్ణాలు సాధించింది.

అలాగే మహిళల కాంపౌండ్‌ టీమ్‌ చైనాను, పురుషుల కాంపౌండ్‌ టీమ్‌ కూడా చైనాను ఓడించగా.. మిక్స్‌డ్‌ టీమ్‌ ఫైనల్‌లో దక్షిణకొరియాపై భారత్‌ విజయం సాధించింది. కాగా ఇప్పుడు రికర్వ్‌ విభాగంలో వచ్చిన ఈ స్వర్ణంతో.. ఆసియా క్రీడల్లో భారత ఆర్చర్ల ఆధిపత్యం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. గత ఆసియా క్రీడల్లో రికర్వ్‌ టీమ్‌ విభాగంలో కాంస్యంతో సరిపెట్టుకున్న భారత మహిళలు.. ఈసారి ఏకంగా స్వర్ణాన్ని అందుకోవడం మరో కీలక మైలురాయిగా నిలిచింది.

ఇక 2010, 2022 ఆసియా క్రీడల్లో భారత్‌ మహిళల రికర్వ్‌ టీమ్‌ కాంస్య పతకాలు సాధించింది. తాజా స్వర్ణంతో భారత్‌ పతకాల పట్టికలో ఏడో స్థానానికి చేరింది. అక్టోబర్‌ 2 నాటికి భారత ఖాతాలో మొత్తం 67 పతకాలు ఉన్నాయి. ఇందులో 11 స్వర్ణాలు, 23 రజతాలు, 33 కాంస్య పతకాలు ఉన్నాయి. ఆర్చరీలో వచ్చిన వరుస స్వర్ణాలు భారత పతకాల సంఖ్యను పెంచడమే కాకుండా.. అంతర్జాతీయ వేదికపై భారత ఆర్చర్ల స్థాయిని కూడా మరోసారి చాటిచెప్పాయి..

#Asian Games 2026#sports#Archery#indian-women#recurve-team#gold medal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి