వైరల్ న్యూస్

Viral : రీల్స్ బానిసైన మహిళ.. నెట్ రావడం లేదని దారుణం

రచన: Kumar4 నిమిషాల పఠనం

సోషల్ మీడియాకు బానిసై కొందరు వింతగా ప్రవర్తించడం చూసే ఉంటాం.. ఆన్‌లైన్స్ గేమ్స్ ఆడుతూ అందులో లీనమై రాత్రిళ్లు కూడా చేతులు ఫోన్‌ను పట్టుకుని గేమ్స్ ఆడుతున్నట్టు, రీల్స్ షేర్ చేస్తున్నట్టు ప్రవర్తిస్తుంటారు. కొందరైతే గేమ్స్ ఆడుతూ సౌండ్స్ చేస్తుంటారు

సోషల్ మీడియాకు బానిసై కొందరు వింతగా ప్రవర్తించడం చూసే ఉంటాం.. ఆన్‌లైన్స్ గేమ్స్ ఆడుతూ అందులో లీనమై రాత్రిళ్లు కూడా చేతులు ఫోన్‌ను పట్టుకుని గేమ్స్ ఆడుతున్నట్టు, రీల్స్ షేర్ చేస్తున్నట్టు ప్రవర్తిస్తుంటారు. కొందరైతే గేమ్స్ ఆడుతూ సౌండ్స్ చేస్తుంటారు. దానినే నిద్రలోనూ రిపీట్ చేస్తుంటారు. రోజంతా ఫోన్‌‌తో ఆడటం, అందులో లీనమైపోవడం వల్లే ఇలాంటివి జరుగుతుంటాయి. ఇక కొందరికి ఫోన్ ఒక వ్యసనంలా మారింది.

ఒక క్షణం ఫోన్ లేకుండా కొందరు ఉండలేకపోతున్నారు. నిత్యం నెట్ వినియోగం, రీల్స్, ఆన్లైన్ గేమ్స్ మాయలో పడి తమ జీవితాలను, కెరీర్‌ను నాశనం చేసుకుంటున్నారు. ఆన్లైన్ గేమ్స్ బారిన పడి డబ్బులు నష్టపోయి చాలా మంది బలవన్మరణాలకు పాల్పడిన విషయం తెలిసిందే. తాజాగా ఓ మహిళా రీల్స్‌కు బానిసై ఇంటర్నెట్ రావడం లేదనే కోపంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు సమాచారం. ఈ ఘటన ఛత్తిస్ గఢ్ రాష్ట్రం కోర్బా జిల్లాలోని కేరాకచ్చర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగుచూసింది.

మంగ్లో బాయీ(52) అనే మహిళ రీల్స్‌కు బాగా అలవాటు పడింది.ఈ క్రమంలో రీల్స్ చూస్తుండగా పదే పదే ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో తీవ్ర కోపాద్రిక్తురాలై ఆమె ఫోన్‌ను నేలకేసి బద్దలుకొట్టింది. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే,ఇంట్లో ఫోన్ ముక్కలై కనిపించడం, ఆ తర్వాత తన తల్లి అచేతన స్థితిలో కనిపించడంతో

ఆమె కుమార్తె (17) ఇంట్లో వాళ్లకు విషయం చెప్పింది.మంగ్లో బాయి పక్కన పురుగుల మందు డబ్బాను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే, మార్గమధ్యలోనే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు వెల్లడించారు.రీల్స్ మత్తులో పడి సదరు వివాహిత ప్రాణం తీసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందుకే ఫోన్స్, రీల్స్, ఆన్లైన్ గేమ్స్‌కు దూరంగా ఉండాలని, వ్యసనంలా మారితే ఇలాగే ప్రాణాల మీదకు తెస్తుందని పలువురు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.

https://x.com/pulsenewsbreak/status/2097552734161682524?s=20

#women suicide#reels#instagram#viralnews#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి