ఏపీ

Viral : రూ.లక్షా 50 వేలకు దంపతులను అమ్మేసిన ఏజెంట్.. వైరల్!

రచన: Kumar3 నిమిషాల పఠనం

ఆన్‌లైన్, ట్రావెల్ ఏజెంట్స్ మోసాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్ మీద ఆశతో విదేశాలకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకుని, కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశపడిన వారికి నిరాశే మిగులుతోంది. కొందరు ఏజెంట్స్ డబ్బులను ఆశపడి వారిని నట్టేట ముంచుతున్నారు.

ఆన్‌లైన్, ట్రావెల్ ఏజెంట్స్ మోసాలు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. భవిష్యత్ మీద ఆశతో విదేశాలకు వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించుకుని, కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశపడిన వారికి నిరాశే మిగులుతోంది. కొందరు ఏజెంట్స్ డబ్బులను ఆశపడి వారిని నట్టేట ముంచుతున్నారు. జాబ్స్ ఇప్పిస్తామని నమ్మించి వారి నుంచి ముందే డబ్బులు వసూలు చేసుకుని విదేశాలకు పంపించి హ్యాండ్ ఇస్తున్నారు.

ఇలాంటి ఘటనలు ఎక్కడో చోట వెలుగుచూస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇలా మోసపోయిన వారి లిస్టు చాలానే ఉంది. చివరకు తాము మోసపోయామని, రక్షించి ఇండియాకు తీసుకురావాలని కుటుంబసభ్యులకు సమాచారం ఇస్తున్నారు. తీరా ఆ నరకం కూపం నుంచి బయటపడి ఇండియాకు వచ్చాక తమ వాళ్లను చూసుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఏపీలోని విశాఖపట్నంలో వెలుగుచూసింది.

వివరాల్లోకివెళితే.. మలేషియాలో ఉద్యోగాల పేరుతో విశాఖకు చెందిన దంపతులను ఓ ఏజెంట్ మోసంచేశాడు.మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ రామచంద్ర టెస్టింగ్ సెంటర్ నిర్వాహకుడు.. విశాఖకు చెందిన దంపతుల నుంచి రూ.4 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం.మలేషియా పంపించి.. అక్కడికి వెళ్లగానే ఏజెంట్ వచ్చి ఉద్యోగంలో జాయిన్ చేస్తాడని నిర్వాహకుడు నమ్మించాడు.

అయితే, మలేషియాకు వెళ్లిన తర్వాత రీసివ్ చేసుకున్న ఏజెంట్ తమను ఓ హోటల్‌కు రూ.1.50 లక్షలకు అమ్మేశాడని దంపతుల ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు.తమను స్వదేశానికి తీసుకొచ్చి న్యాయం చేయాలని విశాఖకు చెందిన దంపతులు వాపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

#vizag#couple#cheated by agent#malaysia#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి