పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత వివాహేతర సంబంధాల ముసుగులో కొందరు పురుషులు, మహిళలు తమ దాంపత్య జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో భర్తలు, భార్యలను అంతమొందిస్తున్న ఘటనలు అనేకం వెలుగుచూస్తున్నాయి. భర్త ఉండగానే కొందరు మహిళలు పరాయి పురుషుడి మోజులో పడి సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు.పిల్లలు ఉన్నారని కూడా ఆలోచించడం లేదు. తమ వ్యక్తిగత సుఖసంతోషాల కోసం ఎదుటి వారి జీవితాన్ని పణంగా పెడుతున్నారు.
భర్తకు తెలియకుండా కొందరు మహిళలు గుట్టుగా వివాహేతర సంబంధం నడిపిస్తుండటం ఒక ఎత్తయితే..అతన్ని అడ్డుతొలగించుకోవడానికి ఏకంగా మర్డర్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటివరకు ఇలాంటి ఘటనలు చాలానే వెలుగుచూశాయి.ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చడం, అడ్డుగా ఉన్నారని పిల్లలను కూడా హతమారుస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగుచూసింది.
పెళ్లయిన ఆరు నెలలకే ఓ మహిళ తన భర్తను కడతేర్చింది.ప్రియుడి కోసం ఈ పని చేయడంతో పాటు మర్డర్ అనంతరం అక్కడి నుంచి జంప్ అయ్యింది. ఈ ఘటన కర్ణాటకలోని విజయపురా జిల్లా ముద్దెబిహాళ్ తాలూకా రుదాగి గ్రామంలో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకివెళితే.. గణేశ్ బసప్ప(27)కు ఆరు నెలల క్రితం అక్షత అనే యువతితో వివాహం జరిగింది. అక్టోబర్ 21 తెల్లవారుజామున గణేశ్ బసప్ప తన ఇంట్లోనే హత్యకు గురయ్యాడు.
గణేశ్ నిద్రలో ఉన్నప్పుడు అతన్ని కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు. ప్రియుడితో వెళ్లిపోయేందుకే కట్టుకున్న భార్య అక్షత..భర్తను గొంతు కోసి హతమార్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.ఎందుకంటే హత్య అనంతరం అమె కనిపించకుండా పోయింది. ఆక్షత ప్రియుడు కూడా కనిపించడం లేదని సమాచారం.కాగా, అక్షత రోజూ ఓ వ్యక్తితో మాట్లాడేదని గణేశ్ సోదరుడు సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై తన భార్యను గణేశ్ ప్రశ్నించగా రివర్స్‌లో అతన్నే బెదిరించిందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ప్రస్తుతం పరారీలో ఉన్న అక్షత, ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు.


