International

‘షమొండా’ కలకలం.. పశువుల నుంచి మనుషులకు సోకిన వైరస్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

పశువులకు మాత్రమే సోకుతుందని భావించిన ప్రమాదకరమైన 'షమొండా వైరస్‌' (Shamonda Virus) ఇప్పుడు మానవులకు కూడా సోకగలదని తేలడం అంతర్జాతీయ వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈగల ద్వారా కేవలం జంతువులలో మాత్రమే వ్యాపించే ఈ వైరస్‌ బారినపడి ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటిసారి అని వైద్య అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.

పశువులకు మాత్రమే సోకుతుందని భావించిన ప్రమాదకరమైన 'షమొండా వైరస్‌' (Shamonda Virus) ఇప్పుడు మానవులకు కూడా సోకగలదని తేలడం అంతర్జాతీయ వైద్య వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా ఈగల ద్వారా కేవలం జంతువులలో మాత్రమే వ్యాపించే ఈ వైరస్‌ బారినపడి ఫ్రాన్స్‌లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ప్రపంచవ్యాప్తంగా ఇదే మొదటిసారి అని వైద్య అధికారులు అధికారికంగా ధ్రువీకరించారు.

తూర్పు ఫ్రాన్స్‌లో ఈ ఏడాది ప్రారంభంలో పశువులలో ఈ వైరస్‌ జాడ వెలుగుచూడగా, తాజాగా మనుషుల్లోనూ దీని ప్రాణాంతక ప్రభావం బయటపడింది. తొలుత ఈ వైరస్‌ను 1965లోనే నైజీరియాలోని పశువులలో గుర్తించారు. కాలక్రమేణా 2026 అక్టోబర్ నాటికి పశుపోషణ అధికంగా ఉండే ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఐర్లాండ్ వంటి యూరప్ దేశాలకు ఇది విస్తరించింది. ప్రధానంగా సన్నని ఈగలను పోలిన 'మిడ్జ్‌ల' (Midges) కాటు ద్వారా ఈ వైరస్ జంతువులకు సోకుతుంది.

అయితే ఫ్రాన్స్‌లోని లియోన్ నగర ఆసుపత్రిలో ఇప్పటికే తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకడంతో ఆయన మెదడులో తీవ్రమైన సమస్యలు తలెత్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. రోగ నిరోధక శక్తి (Immunity) అత్యంత తక్కువగా ఉన్నవారిపై ఈ వైరస్ తీవ్రంగా దాడి చేస్తుందని తేలింది. పశువుల్లో ఈ వైరస్ సోకితే తీవ్రమైన జ్వరం, విరేచనాలు రావడం, పాల ఉత్పత్తి భారీగా తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే పశువులకు గర్భస్రావం కావడం, పిండాల్లో అవయవ లోపాలు ఏర్పడటం, గుర్రాలలో నాడీ వ్యవస్థ సంబంధిత రుగ్మతలు వస్తాయని ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థ (WOAH) హెచ్చరించింది.

పశువుల నుంచి మనుషులకు ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది, భవిష్యత్తులో ఇది ఇతరులకు సోకే ప్రమాదం ఎంతవరకు ఉందనే అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)తో పాటు నిపుణులు మరింత లోతుగా పరిశోధనలు జరుపుతున్నారు. షమొండా వైరస్ మనుషుల్లోనూ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందనే వాస్తవం వెలుగులోకి రావడంతో పశువుల పెంపకందారులు, వైద్య నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

#ShamondaVirus2026#FranceFirstHumanCase#AnimalToHumanVirus#MidgeBiteDisease#InternationalHealthNews#WorldHealthOrganization#MedicalNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి