వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా విజయపతాకం ఏగరేసేందుకు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉండగానే ముందస్తు ప్రణాళికలు రచిస్తోంది.గతంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్, బీజేపీ తరఫున బిగ్ షాక్ తగిలింది.ఈసారి అలా కాకుండా చూడాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరు ఉమ్మడి జిల్లాల బీఆర్ఎస్ నేతలకు కీలక సూచనలు చేశారు. ఈ మేరకు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ‘ఖమ్మం–వరంగల్–నల్గొండ’, ‘మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్’ అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కొత్త ఇన్‌చార్జిలను నియమించారు.
నయా సారధులు..
రంగారెడ్డి జిల్లా..
అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా గులాబీ పార్టీ ఇన్‌చార్జిల నియామకం చేపట్టింది. మేడ్చల్- రాగిడి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి- నందికంటి శ్రీధర్, కుత్బుల్లాపూర్ -కె.నవీన్ రావు (ఎమ్మెల్సీ), కూకట్‌పల్లి -గజ్జెల నాగేశ్, ఉప్పల్ -గొంగిడి మహేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం- స్వామి గౌడ్, ఎల్బీనగర్ -నాగేశ్ ముదిరాజ్, మహేశ్వరం -వాణీదేవి (ఎమ్మెల్సీ), రాజేంద్రనగర్ -రావుల శ్రీధర్ రెడ్డి, శేరిలింగంపల్లి- శంభీపూర్ రాజు (ఎమ్మెల్సీ), చేవెళ్ల (ఎస్సీ)-రాంబాబు యాదవ్, పరిగి -ఎం.ఎన్. శ్రీనివాస్, వికారాబాద్ (ఎస్సీ) -గట్టు రాంచందర్ రావు, తాండూరు -విప్లవ్ కుమార్ కు చోటు దక్కింది.
హైదరాబాద్ జిల్లా-..
ముషీరాబాద్ వెంకట్‌రెడ్డి,అంబర్‌పేట -కోలేటి దామోదర్ గుప్తా, ఖైరతాబాద్ -డాక్టర్ దాసోజు శ్రవణ్ (ఎమ్మెల్సీ), జూబ్లీహిల్స్ -విష్ణువర్ధన్ రెడ్డి, సనత్‌నగర్ -గోసుల శ్రీనివాస్‌యాదవ్, సికింద్రాబాద్ -ఎండీ సలీం, సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) -మన్నె క్రిశాంక్, నాంపల్లి -షేక్ అబ్దుల్లా సోహైల్, కార్వాన్ -ఇనాయత్ అలీ బాక్రీ, గోషామహల్ -గౌండ్ల నాగేందర్ గౌడ్, చార్మినార్ -అలీ బిన్ ఇబ్రహీం మస్కతి, చాంద్రాయణగుట్ట- షాహీన్ అఫ్రోజ్, యాకుత్‌పురా అర్షద్ అలీ ఖాన్, బహదూర్‌పురా -ఎస్.ఏ. ఖైసర్, మలక్‌పేట -మహమ్మద్ ఆజం అలీ అవకాశం కల్పించారు.
మహబూబ్‌నగర్ జిల్లా..
కొడంగల్ -నవీన్ కుమార్‌రెడ్డి (ఎమ్మెల్సీ), నారాయణపేట- రాజీవ్ సాగర్, మహబూబ్‌నగర్- వాల్యా నాయక్, జడ్చర్ల -పాల్వాయి స్రవంతి, దేవరకద్ర -పల్లె రవికుమార్, మక్తల్- దూదిమెట్ల బలరాజు, వనపర్తి -మహమ్మద్ ఇంతియాజ్ ఇషాక్, గద్వాల -ఆంజనేయ గౌడ్, అలంపూర్ (ఎస్సీ) -చల్లా వెంకట్రామిరెడ్డి (ఎమ్మెల్సీ), నాగర్‌కర్నూల్- జహంగీర్, అచ్చంపేట (ఎస్సీ) -శుభప్రద్ పటేల్ నూలి, కల్వకుర్తి -రజిని సాయిచంద్, షాద్‌నగర్ -బైకాని శ్రీనివాస్ యాదవ్, కొల్లాపూర్ -అల్లిపురం వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులకు పార్టీ చాన్స్ ఇచ్చింది.
నల్గొండ జిల్లా..
దేవరకొండ (ఎస్టీ)- చింతల వెంకటేశ్వర్ రెడ్డి, నాగార్జునసాగర్- బూడిద భిక్షమయ్య గౌడ్, మిర్యాలగూడ -బి.లింగయ్య యాదవ్, హుజూర్‌నగర్ -కంచర్ల కృష్ణారెడ్డి, కోదాడ -తిప్పన విజయసింహారెడ్డి, సూర్యాపేట- ఏస్లావత్ రాంచందర్ నాయక్, నల్గొండ -ఎంసీ కోటిరెడ్డి (ఎమ్మెల్సీ), మునుగోడు- వెంకట నారాయణ గౌడ్, భువనగిరి- కర్నె ప్రభాకర్, నకిరేకల్ (ఎస్సీ)- గుజ్జ దీపిక యుగంధర్‌రావు,తుంగతుర్తి (ఎస్సీ)- ఎలగందుల వెంకటేశ్వర్, ఆలేరు -బండ నరేందర్‌రెడ్డి ఇన్‌చార్జులుగా నియమితులయ్యారు.
ఖమ్మం జిల్లా ..
పినపాక- (ఎస్టీ) దిండిగాల రాజేందర్, ఇల్లందు (ఎస్టీ)- చాడ కిషన్‌రెడ్డి,ఖమ్మం -టి.రవీందర్ రావు, పాలేరు- తాతా మధు (ఎమ్మెల్సీ), మధిర (ఎస్సీ) -నామా నాగేశ్వరరావు, వైరా (ఎస్టీ)- ఆర్.జె.సి. కృష్ణ, సత్తుపల్లి (ఎస్సీ) -కూరాకుల నాగభూషణం, కొత్తగూడెం-వద్దిరాజు రవిచంద్ర (ఎంపీ), అశ్వారావుపేట (ఎస్టీ) -ఉప్పల వెంకట రమణ, భద్రాచలం (ఎస్టీ)- రావలపల్లి రామ్ ప్రసాద్‌లు ఉన్నారు.
వరంగల్ జిల్లా..
జనగామ- బండ శ్రీనివాస్, ఘన్‌పూర్ (ఎస్సీ) -నాగుర్ల వెంకన్న, పాలకుర్తి- ఎం. సుధీర్ కుమార్, డోర్నకల్ (ఎస్టీ) -మాలోత్ కవిత, మహబూబాబాద్ (ఎస్టీ) -సత్యవతి రాథోడ్, నర్సంపేట -పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పరకాల- సమ్మారావు, వరంగల్ వెస్ట్ -బి.వినోద్‌కుమార్, వరంగల్ ఈస్ట్ -మర్రి యాదవరెడ్డి, వర్ధన్నపేట (ఎస్సీ) -మసూద్, భూపాలపల్లి -రామస్వామి నాయక్, ములుగు (ఎస్టీ)- ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవకాశం కల్పించారు.
బీఆర్ఎస్ ఓటములు..
2018లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలిచినా ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగిలాయి. 2019లో కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి విజయం సాధించగా, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓటమి పాలయ్యారు.ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దాంతో ‘వరంగల్-ఖమ్మం-నల్గొండ’ పట్టభద్రుల స్థానానికి ఉపఎన్నిక జరగగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. 2025 మార్చిలో జరిగిన ‘మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్’ పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు ప్రధానంగా తలపడగా బీజేపీ అభ్యర్థి సి.అంజిరెడ్డివిజయం సాధించారు. ఈ ఎన్నికకు బీఆర్ఎస్ దూరంగా ఉన్నది.
కేటీఆర్ టార్గెట్ రీచ్ అవుతారా?
2028 చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జమిలి వస్తే 2029లో ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగనున్నాయి. అప్పుడే తెలంగాణలోనూ ఎన్నికలు జరుగుతాయి. అయితే, వచ్చే ఏడాది మార్చిలో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇవి సెమీఫైనల్ కానున్నాయని బీఆర్ఎస్ చెబుతోంది. కాంగ్రెస్ పార్టీ పాలనా తీరుపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే క్షేత్రస్థాయిలో పార్టీకి మైలేజ్ పెరిగిందని, ప్రజలంతా మరల కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారనే బలమైన సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ అధినాయకత్వం ప్లాన్ చేస్తోంది. కాంగ్రెస్ ఓడితే రేవంత్ పతనం ప్రారంభం మైందని, అందుకు ఈ ఎన్నికల ఫలితాలే ఆధారమని బీఆర్ఎస్ ప్రచారం చేయనుంది.
అందుకే కేటీఆర్ ముందస్తుగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నాలుగు నెలల ముందుగానే ఇన్‌చార్జిలను ప్రకటించారు. మరి కేటీఆర్ నమ్మకాన్ని వీరంతా నిలబెడతారా? ఎన్నికల్లో గులాబీ అభ్యర్థులను గెలిపిస్తారా? రేవంత్ సర్కారుకు బలమైన సంకేతాన్ని పంపిస్తారా? గత ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకుంటారా? లేదా? అనేది మున్ముందు తెలియాల్సి ఉంది.


