సినిమా

Varanasi: వారణాసి కోసం రాజమౌళి ఎప్పుడు ఇలా చేయలేదు!

5 నిమిషాల పఠనం

Varanasi: మన టాలీవుడ్ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’. ఈ సినిమా కోసం రాజమౌళి గతంలో ఏ పాన్ ఇండియా సినిమాకి చేయని ప్లాన్స్ చేస్తున్నారు. నిజంగా, ఇది కేవలం ఒక్క రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే విషయమని చెప్పాలి. డిజిటల్ రైట్స్ రూపంలోనే సగం బడ్జెట్ రికవరీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి.

Varanasi: మన టాలీవుడ్ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’. ఈ సినిమా కోసం రాజమౌళి గతంలో ఏ పాన్ ఇండియా సినిమాకి చేయని ప్లాన్స్ చేస్తున్నారు. నిజంగా, ఇది కేవలం ఒక్క రాజమౌళికి మాత్రమే సాధ్యమయ్యే విషయమని చెప్పాలి. డిజిటల్ రైట్స్ రూపంలోనే సగం బడ్జెట్ రికవరీ చేయాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు రాజమౌళి.

వారణాసి మూవీలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత కేఎల్ నారాయణ నిర్మిస్తుండగా.. ఎస్.ఎస్.కార్తికేయ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక, ఈ చిత్రాన్ని 2027, ఏప్రిల్ 7న విడుదల పాన్-వరల్డ్ స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

అయితే, ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ కి సంబందించిన ఓటీటీ రైట్స్ డీల్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారడం విశేషం. వారణాసి సినిమా డిజిటల్ రైట్స్ కోసం దిగ్గజ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చనట్లు గతంలోనే వార్తలు వచ్చాయి. కానీ, జక్కన్న ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేశారట. దీనికి కారణం, ఈ సినిమా భారీ బడ్జెట్ అలాగే, రాజమౌళి ఇంటర్నేషనల్ రేంజ్‌లో ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఈ ఆఫర్ చాలా తక్కువని మేకర్స్ సున్నితంగా తిరస్కరించినట్టుగా సమాచారం.

ఇక, తాజా సమాచారం మేరకు వారణాసి డిజిటల్ రైట్స్ ద్వారా భారీ స్థాయిలో ఆదాయం రాబట్టేందుకు రాజమౌళి ఓ ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. డిజిటల్ రైట్స్ ను ఒకే ప్లాట్‌ఫామ్‌కు కాకుండా.. వేర్వేరు రీజియన్ల వారీగా బిజినెస్ క్లోజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సౌత్ లాంగ్వేజెస్ అయిన తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల హక్కులను ఒక ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌కు ఇచ్చేలా సనాహాలు చేస్తునారట.

అలాగే, హిందీ వర్షన్ హక్కులను మరో దిగ్గజ ఓటీటీ సంస్థకు.. అంతర్జాతీయ భాషల డిజిటల్ హక్కులను వేరొక గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు..ఇలా వేర్వేరుగా డీల్ క్లోజ్ అయ్యేలా చర్చలు జరుపుతున్నారు. ఈ సరికొత్త పద్ధతి ద్వారానే డిజిటల్ రైట్స్ రూపంలో పెట్టిన బడ్జెట్‌లో చాలావరకు రికవరీ చేయాలన్నది జక్కన్న ప్లాన్ అట. ఈ డీల్స్ అన్నింటినీ ఇదే ఏడాదిలోపే క్లోజ్ చేయాలని నిర్మాతలు గట్టిగా టార్గెట్ పెట్టుకున్నారు. ఇలాంటి అసాధ్యమైన పనులను కూడా ఒకే ఒక్క రాజమౌళి సుసాధ్యం చేయగలడు. ఇందులో, ఎలాంటి సందేహమూ లేదు.

#SS.Rajamouli#Super Star Mahesh Babu#Priyanka Chopra#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి