వైరల్ న్యూస్

Tube vs Tubeless Tyres: ట్యూబ్‌ టైరా లేదంటే ట్యూబ్ లెస్ టైరా.. ఏది వేయిస్తే బెటర్‌?

6 నిమిషాల పఠనం

Tube vs Tubeless Tyres: కొత్త వాహనం కొంటున్నప్పుడైనా, లేదా పాత బండికి టైర్లు మార్చే టైంలో చాలామందిని వేధించేది ఒక్కటే ట్యూబ్ టైర్ వేయించాలా? లేక ట్యూబ్‌లెస్ టైర్ వేయించాలా? బండి మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులతో పాటు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మీ ప్రాణాల భద్రత కూడా ఈ టైర్ల ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. అసలు ఈ రెండింటిలో ఏది బెస్ట్? దేనివల్ల ఎలాంటి లాభాలు, నష్టాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం.

Tube vs Tubeless Tyres: కొత్త వాహనం కొంటున్నప్పుడైనా, లేదా పాత బండికి టైర్లు మార్చే టైంలో చాలామందిని వేధించేది ఒక్కటే ట్యూబ్ టైర్ వేయించాలా? లేక ట్యూబ్‌లెస్ టైర్ వేయించాలా? బండి మైలేజ్, మెయింటెనెన్స్ ఖర్చులతో పాటు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు మీ ప్రాణాల భద్రత కూడా ఈ టైర్ల ఎంపికపైనే ఆధారపడి ఉంటుంది. అసలు ఈ రెండింటిలో ఏది బెస్ట్? దేనివల్ల ఎలాంటి లాభాలు, నష్టాలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకుందాం.

పంక్చర్ భయం ఉండకూడదంటే..

రోడ్డుపై వెళ్లేటప్పుడు ఏదైనా మేకు లేదా పదునైన వస్తువు గుచ్చుకుంటే ఈ రెండింటి రియాక్షన్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ట్యూబ్‌లెస్ టైర్‌లో ప్రత్యేకంగా లోపల రబ్బరు గొట్టం ఉండదు. టైరు లోపలి పొరే వీల్ రిమ్‌కు గట్టిగా లాక్ అయి గాలిని నిలుపుతుంది. మేకు గుచ్చుకున్నప్పటికీ అది టైరులోనే ఇరుక్కుపోయి గాలిని చాలా నిదానంగా మాత్రమే బయటకు పోనిస్తుంది. దీనివల్ల డ్రైవర్‌కు వెహికల్‌పై పూర్తి కంట్రోల్ ఉంటుంది. హైవేలపై వంద స్పీడ్‌లో ఉన్నా ఒక్కసారిగా బండి అదుపు తప్పే ప్రమాదం ఉండదు. పైగా టైరును విప్పాల్సిన పనిలేకుండా బయట నుంచే రెండు నిమిషాల్లో పంక్చర్ వేయించుకోవచ్చు. ఇక ట్యూబ్ టైర్ విషయానికి వస్తే ఇందులో గాలి కోసం లోపల ప్రత్యేక రబ్బరు ట్యూబ్ ఉంటుంది. మేకు తగలగానే బెలూన్‌లా క్షణాల్లో గాలి మొత్తం ఖాళీ అయిపోతుంది. వేగంగా వెళ్లేటప్పుడు ఇలా జరిగితే బైక్, కార్ బ్యాలెన్స్ తప్పి బోల్తా పడే ముప్పు చాలా ఎక్కువ. పంక్చర్ పడితే మొత్తం వీల్‌ను ఊడదీసి రిపేర్ చేయాల్సి వస్తుంది.

మీ బండికి ఏ టైర్ వేయించాలనేది మీ చక్రాల డిజైన్‌పై కూడా ఆధారపడి ఉంటుంది. మీ కారు లేదా బైక్‌కు అల్లాయ్ వీల్స్ ఉంటే కళ్లు మూసుకుని ట్యూబ్‌లెస్ టైర్లే బెస్ట్ ఛాయిస్. ఇవి రిమ్‌తో కలిసి పక్కాగా ఎయిర్-టైట్ సీలింగ్ ఇస్తాయి. సాధారణ బైక్‌లు, బుల్లెట్ పాత మోడళ్లు లేదా ఆఫ్-రోడింగ్ వెహికల్స్‌కు ఉండే స్పోక్స్ వీల్స్‌కు రంధ్రాల ద్వారా గాలి లీకయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాటికి ట్యూబ్ టైర్లే అనుకూలంగా ఉంటాయి.

బడ్జెట్, రిపేర్ ఖర్చులు ఎలా ఉంటాయి..

ట్యూబ్ టైర్లు స్టార్టింగ్‌‌లో కొనేటప్పుడు ధర కాస్త తక్కువగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాలు, చిన్న పల్లెటూళ్లలో ఎక్కడైనా ఏ మెకానిక్ అయినా సులువుగా రిపేర్ చేసేయగలడు. గులకరాళ్లు, గుంతల రోడ్లను తట్టుకునే సామర్థ్యం వీటికి కాస్త ఎక్కువ. ట్యూబ్‌లెస్ టైర్లు ధర కొద్దిగా ఎక్కువైనా.. లాంగ్ జర్నీ, రోజువారీ సిటీ డ్రైవింగ్‌కు ఇచ్చే మైలేజ్, లైఫ్ చాలా ఎక్కువ. చిన్న పంక్చర్ అయితే దారిపొడవునా గాలి కొట్టుకుంటూ నిశ్చింతగా వెళ్లొచ్చు.

ఫైనల్ తీర్పు.. ఏది వేయిస్తే బెటర్?

మీరు ఎక్కువగా సీటీలో ప్రయాణిస్తూ, వీకెండ్స్‌లో హైవే ట్రిప్పులు వేసే వారైతే.. మీ వెహికల్‌కి అల్లాయ్ వీల్స్ ఉంటే ఏమాత్రం ఆలోచించకుండా ట్యూబ్‌లెస్ టైర్లనే ఎంచుకోండి. ఇది మీ ప్రయాణాన్ని సేఫ్‌గా ఉంచడమే కాకుండా పంక్చర్ టెన్షన్‌ను పూర్తిగా దూరం చేస్తుంది. ఒకవేళ మీరు పల్లెటూళ్లలో, గుంతలు ఎక్కువగా ఉండే మట్టి రోడ్లపై తిరుగుతూ, బండికి స్పోక్ వీల్స్ ఉండి.. తక్కువ బడ్జెట్‌లో రిపేర్లు ముగిసిపోవాలనుకుంటే మాత్రం ట్యూబ్ టైర్లుసరిపోతాయి.

#Tube vs Tubeless Tyres#Tube Tyres#Tubeless Tyres#Bike Tyres#Car Tyres#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి