తెలంగాణ

ప్రభుత్వం గుడ్‌న్యూస్.. కొత్తగా 4.5లక్షల పెన్షన్లు

2 నిమిషాల పఠనం

తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ కానుకగా కొత్తగా 4.5 లక్షల మందికి చేయూత పెన్షన్లు ఇవ్వనుంది.

Danasari Seethakka: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగ కానుకగా కొత్తగా 4.5 లక్షల మందికి చేయూత పెన్షన్లు ఇవ్వనుంది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఆదివారం కొడంగల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు. సీఎం రేవంత్ కొంతమంది లబ్దిదారులకు స్వయంగా మంజూరు పత్రాలు అందించనున్నారు. అనంతరం అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు ద్వారా లబ్దిదారులకు పత్రాల పంపిణీ ఉంటుందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, నేత కార్మికులు, గీత కార్మికులకు పెన్షన్లను ప్రభుత్వం ఇవ్వనుందని ఆమె వెల్లడించారు. కొత్తగా పింఛన్లు మంజూరైన వారికి ఈ నెల నుంచే నగదు చెల్లిస్తామని స్పష్టం చేశారు. పండుగ వేళ ఈ కొత్త పెన్షన్ల ద్వారా లక్షలాది కుటుంబాలకు ప్రజా ప్రభుత్వం ఆర్థిక భరోసాను కల్పించనుందని మంత్రి సీతక్క చెప్పారు.

#Danasari Seethakka#New Pensions#Telangana#Cheyutha Pension Scheme#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి