జాతీయం

Bengaluru Seven Murders: బెంగుళూరు ఏడుగురి హత్య.. అసలు సూత్రదారి కూతురేనా.. ఎలా హెల్ప్‌ చేసిందంటే?

6 నిమిషాల పఠనం

Bengaluru Seven Murders: బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని అత్యంత పాశవికంగా నరికి చంపిన సామూహిక హత్యాకాండలో దర్యాప్తు అధికారులు సైతం నోరెళ్లబెట్టే దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు క్యాబ్ డ్రైవర్ ఇందుశేఖర్ మాత్రమే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని భావించగా.. పోలీసుల విచారణలో తెరపైకి వచ్చిన కోణం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది.

Bengaluru Seven Murders: బెంగళూరులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురిని అత్యంత పాశవికంగా నరికి చంపిన సామూహిక హత్యాకాండలో దర్యాప్తు అధికారులు సైతం నోరెళ్లబెట్టే దిగ్భ్రాంతికర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు క్యాబ్ డ్రైవర్ ఇందుశేఖర్ మాత్రమే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని భావించగా.. పోలీసుల విచారణలో తెరపైకి వచ్చిన కోణం ఒళ్లు గగుర్పొడిచేలా చేస్తోంది. ఈ కిరాతక నరమేధంలో నిందితుడి 17 ఏళ్ల మైనర్ కుమార్తె కేవలం మూగ ప్రేక్షక పాత్రకే పరిమితం కాలేదని, హత్యలకు పక్కాగా పథక రచన చేయడంలో, ఒక్కొక్కరినీ ఉచ్చులోకి లాగడంలో అసలు సూత్రధారిలా వ్యవహరించిందన్న బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కన్నతల్లితో సహా ఏడుగురు బంధువులను చంపడంలో ఆమె తండ్రికి ఏ మేరకు సహకరించిందనే వివరాలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మైండ్‌లోకి ఆస్తి పిచ్చి.. తండ్రితో కలిసి స్కెచ్

కుటుంబ సభ్యులందరినీ అంతం చేస్తేనే ఆస్తి మొత్తం తమకే దక్కుతుందని, ఆర్థికంగా దర్జాగా బతకొచ్చని తండ్రి ఇందుశేఖర్ నూరిపోసిన విషాన్ని ఆ మైనర్ బాలిక పూర్తిగా వంటబట్టించుకుంది. బంధువులంతా తమ ఎదుగుదలకు అడ్డుపడుతున్న శత్రువులని నమ్మి, వారందరినీ భూస్థాపితం చేసేందుకు తండ్రితో చేతులు కలిపింది. ప్రతీ అడుగులోనూ తండ్రి కంటే యాక్టివ్‌గా ఉంటూ ఈ దారుణాన్ని నడిపించిందన్న ఆధారాలు పోలీసులకు చిక్కాయి.

స్వయంగా ఫోన్లు చేసి రప్పించింది

ఈ హత్యాకాండ పదిహేను రోజుల పాటు ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా సాగిందంటే దానికి ప్రధాన కారణం ఆ కూతురే. అక్టోబర్ 16 నుంచి 31 మధ్య ఒక్కొక్కరినీ పక్కా ప్లాన్ ప్రకారం మాయమాటలతో ఇంటికి పిలిపించింది. కన్నతల్లి సునీతను తండ్రి చంపేసిన తర్వాత.. నానమ్మ రూపావతికి స్వయంగా ఈ అమ్మాయే ఫోన్ చేసింది. "అమ్మ ఊరెళ్లింది.. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను, నువ్వు రా నానమ్మా" అంటూ అమాయకంగా మాట్లాడి మృత్యుఒడిలోకి లాగింది. ఆ తర్వాత పిన్నులు, బాబాయ్ కుటుంబాలకు కూడా కూతురి ద్వారానే ఫోన్లు చేయించారు. "ఇంట్లో సరదాగా విందు చేసుకుంటున్నాం, అందరూ రండి" అంటూ పిలిచి, వారు రాగానే తండ్రి సహాయంతో విడివిడిగా కసాయిలా నరికి చంపేశారు.

రక్తం తుడవడం నుంచి శవాల డంపింగ్ వరకు..

హత్యలు చేయడం ఒక ఎత్తయితే.. ఆధారాలు లేకుండా చేయడంలో ఆ అమ్మాయి చూపిన చతురత పోలీసులను నిశ్చేష్టులను చేస్తోంది. ఒక్కొక్కరిని నరికి చంపిన వెంటనే, ఇంట్లో ఎక్కడా ఒక్క రక్తపు చుక్క కూడా కనిపించకుండా కెమికల్స్‌తో నేలను, గోడలను తుడిచేసి సాక్ష్యాలను తుడిచిపెట్టేసింది. శవాలను ప్యాక్ చేసి కారు డిక్కీలో వేసుకుని వేర్వేరు సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే సమయంలో ఆమే ముందు సీట్లో కూర్చుంది. పోలీసులు తనిఖీ చేసినా.. "కుటుంబంతో కలిసి ప్రయాణిస్తున్నారు" అనే భ్రమ కలిగించి ఎలాంటి అనుమానం రాకుండా శవాలను డంప్ చేయడంలో తండ్రికి రక్షణ కవచంలా నిలిచింది.

శవాల మొబైల్స్‌తో సైబర్ డ్రామా

చనిపోయిన ఏడుగురి ఫోన్లను తన ఆధీనంలో ఉంచుకుని ఆ మైనర్ బాలిక నడిపిన హైటెక్ డ్రామా అంతా ఇంతా కాదు. చనిపోయిన బంధువుల ఫోన్ల నుంచే వారి సన్నిహితులకు.. "మేమంతా కలిసి సరదాగా లాంగ్ టూర్‌కు వెళ్లాం.. ఇక్కడ నెట్‌వర్క్ సరిగ్గా లేదు, మేం క్షేమంగానే ఉన్నాం" అంటూ వాట్సాప్, టెక్స్ట్ మెసేజ్‌లు టైప్ చేసి పంపింది. తద్వారా పదిహేను రోజుల పాటు ఎవరికీ అనుమానం రాకుండా పోలీసుల కళ్లుగప్పగలిగింది. కేవలం 17 ఏళ్ల వయసులోనే ఇంతటి నేరపూరిత మనస్తత్వంతో, ఏమాత్రం కనికరం లేకుండా సొంత రక్తాన్నే పంచుకుపుట్టిన ఏడుగురిని మట్టుబెట్టడంలో ఆ మైనర్ అమ్మాయి పోషించిన పాత్ర చూసి దర్యాప్తు బృందాలే నివ్వెరపోతున్నాయి. ప్రస్తుతం ఆమెను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. హత్యల వెనుక అసలు ప్లాన్ తండ్రిదా లేక కూతురి ఆలోచనల మేరకే ఇదంతా జరిగిందా అనే కోణంలో లోతైన విచారణ కొనసాగిస్తున్నారు.

#Bengaluru Seven Murders#Bengaluru Murder Case#Bengaluru Mass Murder#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి