సినిమా

Bollywood: రామాయణ బడ్జెట్ గురించి మాట్లాడొద్దు..సల్మాన్ కామెంట్స్ వైరల్

5 నిమిషాల పఠనం

Bollywood: కొన్నిసార్లు సినిమా కంటే కూడా కాంబినేషన్..బడ్జెట్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతుంటాయి. అలా, ఇప్పుడు అంతటా చర్చలు జరుగుతున్నది బాలీవుడ్‌లో రూపొందిన తాజా చిత్రం రామాయణ సినిమా బడ్జెట్ విహ్స్యంలో..ఈ సినిమాకి ఉపయోగించిన వీఎఫెక్స్ విషయంలో. దీనిపై, తాజాగా బాలీవుడ్ స్టార్..కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యాడు. రామాయణ గురించి మాట్లాడండి..ఆ సినిమా బడ్జెట్ గురించి కాదంటూ చెప్పుకొచ్చాడు.

Bollywood: కొన్నిసార్లు సినిమా కంటే కూడా కాంబినేషన్..బడ్జెట్ గురించే ఎక్కువగా చర్చలు జరుగుతుంటాయి. అలా, ఇప్పుడు అంతటా చర్చలు జరుగుతున్నది బాలీవుడ్‌లో రూపొందిన తాజా చిత్రం రామాయణ సినిమా బడ్జెట్ విహ్స్యంలో..ఈ సినిమాకి ఉపయోగించిన వీఎఫెక్స్ విషయంలో. దీనిపై, తాజాగా బాలీవుడ్ స్టార్..కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయ్యాడు. రామాయణ గురించి మాట్లాడండి..ఆ సినిమా బడ్జెట్ గురించి కాదంటూ చెప్పుకొచ్చాడు.

మన భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా తెరకెక్కిన సినిమా ‘రామాయణ’. నితేశ్ తివారీ దర్శకత్వంలో రణబీర్ కపూర్ రాముడిగా, సౌత్ బ్యూటీ సాయిపల్లవి సీతగా, కన్నడ రాకింగ్ స్టార్ యశ్ రావణుడిగా నటించిన ఈ చిత్రం దేశవ్యాప్తంగా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అయితే, ఈ సినిమా విడుదలకు ముందు నుంచి కథ కంటే బడ్జెట్, విజువల్ ఎఫెక్ట్స్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా, రామాయణ సినిమా రెండు భాగాలకు కలిపి సుమారు రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయించారనే వార్తలు అంతటా హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా, ఈ అంశంపై బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘మాతృభూమి: మే వార్ రెస్ట్ ఇన్ పీస్’. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సల్మాన్ ఖాన్‌ను రామాయణ సినిమా గురించి ప్రశ్నించారు. దీనికి, ఆయన స్పందిస్తూ.. రామాయణ గురించి చర్చ జరగాలి కానీ, దాని బడ్జెట్, వీఎఫ్ఎక్స్ గురించి మాత్రమే మాట్లాడటం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశాడు.

రూ.4 వేల కోట్ల బడ్జెట్, వీఎఫ్ఎక్స్ అంటూ పదేపదే చర్చించడం తనకు సరైనదిగా అనిపించడం లేదని చెప్పారు. రామాయణ అంటే రాముడు, రావణుడు, సీత వంటి పాత్రలు, వాటి వెనుక ఉన్న గొప్ప కథ, విలువల గురించి మాట్లాడాలని చెప్పుకొచ్చాడు. దీంతో సల్మాన్ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజమే, కదా..ఓ భారీ బడ్జెట్ సినిమా..అందులోనూ ఫ్రాంఛైజీస్. మరీ ముఖ్యంగా రామాయణ ఇతిహాసం కాబట్టి, సల్మాన్ మాటలను ఏకీభవించాల్సిందే. ఫక్తు కమర్షియల్ సినిమాకే గ్రాఫిక్స్..వీఎఫెక్స్ అంటూ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ, ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలుస్తున్నాయి. వాటి గురించి మాట్లాడటం కరెక్టే గానీ, రామాయణ లాంటి చిత్రం గురించి పదే పదే బడ్జెట్ విషయం లెవనెత్తి తప్పు చేస్తున్నారు.

#Salman Khan#Ramayana#Ranbeer Kapoor#Sai Pallavi#Yash#Nithish Tiwari
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి