తెలంగాణ

Cm Revanth: యాసంగిలో ఆరు తడి పంటలు మాత్రమే వేయాలి- రైతులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి

3 నిమిషాల పఠనం

రాష్ట్రంలోని రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. యాసంగిలో ఆరు తడి పంటలు మాత్రమే వేయాలని కోరారు. విపక్ష నేతల తప్పుడు మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు.

Cm Revanth: రాష్ట్రంలోని రైతాంగానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. యాసంగిలో ఆరు తడి పంటలు మాత్రమే వేయాలని కోరారు. విపక్ష నేతల తప్పుడు మాటలు విని మోసపోవద్దని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత తీవ్రం అవుతాయని.. జూలై వరకు వర్షాలు రావని, ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సీఎం రేవంత్ సూచించారు. అందరం కలిసికట్టుగా ఉండి ఎల్ నినోను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.

గెలిపించలేదని.. ప్రజలపై కేసీఆర్ కుటుంబం పగబట్టింది

తమను గెలిపించలేదని ప్రజలపై కేసీఆర్ కుటుంబం పగబట్టిందన్నారు. ఓటు వేయలేదనే కక్షతో అబద్దాలు చెప్పి ఆగం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఎల్ నినో విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ప్రపంచవ్యాప్తంగా కరువు వస్తే.. తెలంగాణలో మాత్రమే వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహబూబ్ నగర్ జిల్లాకు కేసీఆర్ చేసింది శూన్యం

''తెలంగాణ వస్తే పాలమూరు జిల్లా బాగుపడుతుందని, పాలమూరు జిల్లాకు న్యాయం జరుగుతుందని ఆశపడ్డాం. తెలంగాణ రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఉంటే ప్రజలు ఆశలు నెరవేరేవి. మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైన కేసీఆర్ ఈ జిల్లాకు చేసింది శూన్యం. స్థానికుడైన విఠల్ రావును ఓడించి మరీ కేసీఆర్ ను గెలిపించారు'' అని సీఎం రేవంత్ అన్నారు.

కొడంగల్ నియోజకవర్గం హకీంపేటలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. హకీంపేటలో అగ్రి ఎక్స్ పో స్టాల్స్ ను పరిశీలించారు. రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్ పోను సీఎం రేవంత్ ప్రారంభించారు.

#Cm Revanth#Brs#Telangana#Congress#Kodangal#Farmers#Elnino#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి