Tollywood: ప్రతీ ఏడాది సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ మన తెలుగు స్టార్స్ నటించిన సినిమాల విడుదల తేదీలపై టాలీవుడ్‌లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అలాగే, ఈ సారి 2027 సంక్రాంతికి కూడా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర విడుదల విషయంలో నిన్నా మొన్నటి వరకూ కాకా చిత్రం పోస్ట్ పోన్ అవుతుందని..ఆ తేదీకి విశ్వంభర రిలీజ్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, మేకర్స్ నుంచి మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
అయితే, మెగాస్టార్ నటిస్తున్న కాకా సినిమా సంక్రాంతికి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో విశ్వంభర రిలీజ్ ఎప్పుడు ఉంటుందనే ప్రశ్న అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇప్పటి వరకూ అందుతున్న సమాచారం మేరకు అసలు విశ్వంభర సినిమా రిలీజ్ విషయంలో కాస్త కూడా క్లారిటీ లేదు. కానీ, అందరూ విశ్వంభర కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా విషయంలో క్లారిటీ లేదు గానీ, కాకా రిలీజ్ విషయంలో మాత్రం డబుల్ కన్‌ఫర్మేషన్ ఇచ్చారు రచయిత కోన వెంకట్.
సంక్రాంతి బరిలో జనవరి 13న కాకా..
తాజా సమాచారం ప్రకారం ‘కాకా’ సినిమా విడుదల తేదీ విషయంలో చిత్రబృందం వెనక్కి తగ్గడం లేదు. జనవరి 13, 2027న సినిమా థియేటర్లలోకి వస్తుందని రచయిత, నిర్మాత కోన వెంకట్ నవంబర్ 6న స్పష్టం చేశారు. సినిమా వాయిదా పడుతుందంటూ వస్తున్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. షూటింగ్ స్పాట్‌లో మెగాస్టార్‌తో కోన మాట్లాడుతున్న సమయంలో తీసిన ఫొటోతో క్లారిటీ ఇస్తూ తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక పోస్ట్ పెట్టారు. దీంతో, కాకా రాక తప్పదని నెట్టింట వైరల్ అవుతున్న రూమర్స్‌కి చెక్ పెట్టినట్టైంది.
బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కాకా చిత్రంపై మెగా అభిమానుల్లోన్నే కాకుండా సినీ లవర్స్‌లో సినీ వర్గాలలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి మాసీవ్ హిట్ తర్వాత చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సంక్రాంతి సీజన్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఇక, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ అనస్వర రాజన్ చిరు కూతురుగా, కమెడియన్ సత్య, గెటప్ శీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్నాడు.


