High Court: మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరిపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ భూముల స్వాధీనంలో కలెక్టర్ నిర్లక్ష్యంపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. బుధవారం కోర్టు విచారణకు కలెక్టర్ మనుచౌదరి హాజరు కాలేదు. దీంతో న్యాయస్థానం సీరియస్ అయ్యింది. కలెక్టర్ మనుచౌదరిని గురువారం ఉదయం కోర్టులో హాజరుపరచాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌కు ఆదేశాలు జారీ చేసింది. కాగా, హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా ప్రభుత్వ భూములను కలెక్టర్లు కాపాడలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూముల పరిరక్షణలో నిర్లక్ష్యంపై సీరియస్
ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి కోర్టు ఆగ్రహానికి గురయ్యారు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి. ఈ వ్యవహారంలో బుధవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, విచారణకు రాలేదు. దీన్ని న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. కలెక్టర్‌ను నేరుగా న్యాయస్థానంలో హాజరుపరచాలని మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్‌ను ఆదేశించారు.
రంగారెడ్డి కలెక్టర్‌కు 6నెలల జైలుశిక్ష
కాగా.. రోజుల వ్యవధిలో హైకోర్టు ఆగ్రహానికి మరో కలెక్టర్ గురికావడం హాట్ టాపిక్ గా మారింది. కోర్టు ఉత్తర్వులను ధిక్కరించిన కేసులో ఇటీవలే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి హైకోర్టు 6 నెలల సాధారణ జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల ఫైన్ వేయడం కలకలం రేపింది. ఈ సంచలన తీర్పు వెలువడిన రెండు రోజుల్లోనే మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌పైనా తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించడం అటు అధికార వర్గాల్లో, ఇటు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. వరుసగా బ్యూరోక్రాట్లు కోర్టుల ఆగ్రహనికి గురికావడం ఆందోళన కలిగించే అంశం.


