తెలంగాణ

Jagga Reddy: సోనియాగాంధీ ఆత్మకథపై సినిమా తీస్తాడట.. అవసరమా జగ్గారెడ్డి?

5 నిమిషాల పఠనం

Jagga Reddy: రాజకీయాల్లో హైలైట్ అవ్వడానికి నేతలు రకరకాల వేషాలు వేస్తుంటారు, లేనిపోని స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. అయితే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన తాజా ప్రకటన చూస్తే మాత్రం కాంగ్రెస్ శ్రేణులే అవాక్కవుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా తాను తెలుగులో ఒక భారీ సినిమా తీయబోతున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు.

Jagga Reddy: రాజకీయాల్లో హైలైట్ అవ్వడానికి నేతలు రకరకాల వేషాలు వేస్తుంటారు, లేనిపోని స్టేట్‌మెంట్లు ఇస్తుంటారు. అయితే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేసిన తాజా ప్రకటన చూస్తే మాత్రం కాంగ్రెస్ శ్రేణులే అవాక్కవుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన ఆత్మకథ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ ఆధారంగా తాను తెలుగులో ఒక భారీ సినిమా తీయబోతున్నట్లు జగ్గారెడ్డి ప్రకటించారు. అంతేకాదు, సంగారెడ్డి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే దీనికి నిర్మాతలని, నాయకులంతా డబ్బులు రెడీ చేసుకోవాలని హుకుం జారీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా షూటింగ్ ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. పైకి ఇది అధినేత్రిపై ఉన్న అభిమానంలా కనిపిస్తున్నా.. అసలు విషయం హైకమాండ్ మెప్పు పొంది మైలేజ్ సాధించడమేనని పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ, ఈ టైమ్‌లో ఇలాంటి ప్రకటనలు జగ్గారెడ్డికి అవసరమా అన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఆత్మకథ అంటే ఆషామాషీ కాదు..

గాంధీ కుటుంబ చరిత్రను, సోనియా గాంధీ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం మాటలతో అయ్యే పని కాదు. నెహ్రూ-గాంధీ కుటుంబ నేపథ్యం, ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న కాలం, దేశంలో ఎమర్జెన్సీ పరిస్థితులు, రాజీవ్ గాంధీతో పరిచయం-వివాహం, ఆయన దారుణ హత్య, ఆ తర్వాత కాంగ్రెస్ సంక్షోభం, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్‌లను ప్రధానులను చేసిన వైనం.. ఇలా దాదాపు నాలుగు దశాబ్దాల దేశ రాజకీయ చరిత్రను చూపించాలి.

ఇంతటి భారీ పీరియాడిక్ డ్రామాను హై-క్వాలిటీతో తీయాలంటే వందల కోట్ల బడ్జెట్ కావాలి. సీనియర్ డైరెక్టర్లు, భారీ క్యాస్టింగ్ అవసరం. అసలే ప్రస్తుతం సాధారణ బడ్జెట్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద నిలబడలేక చతికిలపడుతున్నాయి. అలాంటిది పొలిటికల్ బయోపిక్‌ను కేవలం తెలుగులో తీసి, కార్యకర్తల దగ్గర చందాలు వసూలు చేసి నిర్మిస్తాననడం పచ్చి హాస్యాస్పదం. ఒకవేళ హడావుడిగా ఏదో ఒకటి తీస్తే కోట్లకు కోట్లు నష్టపోవడం ఖాయం.

తీయకపోతే పరువే పోతుందిగా..

మరోవైపు మీడియా ముందుకు వచ్చి ఇంత పెద్ద ప్రకటన చేసిన తర్వాత.. రేపు ఏదైనా కారణంతో ప్రాజెక్ట్ ఆగిపోతే ప్రత్యర్థుల చేతికి జగ్గారెడ్డి స్వయంగా అస్త్రం ఇచ్చినట్లవుతుంది. "ప్రచార యావతోనే సోనియా పేరు వాడుకున్నాడు తప్ప చేతకాదు" అంటూ తీవ్ర విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం ఎమ్మెల్యేగా కూడా లేక, ఆశించిన స్థాయి పదవులు దక్కక తీవ్ర రాజకీయ ఒత్తిడిలో ఉన్న జగ్గారెడ్డి.. క్షేత్రస్థాయిలో పార్టీని, తన క్యాడర్‌ను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలి. కానీ అది వదిలేసి ఇలాంటి సినిమాటిక్ విన్యాసాలు, కోట్లతో కూడిన బయోపిక్ ప్రకటనలు చేయడం వల్ల ఆయనకే తప్ప ఎవరికీ ప్రయోజనం లేదు. అధిష్ఠానం మెప్పు కోసం చేసే ఈ 'సినిమా పిచ్చి' ప్రయోగాలు జగ్గారెడ్డి రాజకీయ భవిష్యత్తుకు మరింత మైనస్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

#: Jagga Reddy#Sonia Gandhi#Sonia Gandhi Autobiography#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి