Tollywood: ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్‌లో సూపర్ హీరో సినిమాల ట్రెండ్ మంచి ఊపు మీదుంది. ఈ జానర్‌లో వస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇప్పటికే యువ హీరో తేజ సజ్జా నటించిన హనుమాన్, మిరాయ్ వంటి సినిమాలు భారీ సక్సెస్ సాధించాయి. దీంతో, ఈ జానర్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగా పెరిగింది. ఇప్పుడు మరో యంగ్ హీరో సూపర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. అతనెవరో కాదు శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా.
సీనియర్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రోషన్ హీరోగా ఓ భారీ పాన్ ఇండియా సూపర్ హీరో సినిమా తాజాగా ప్రారంభమైంది. ఇప్పటి వరకూ నాని లాంటి మిడ్ రేంజ్ హీరోలతో సినిమాలు చేసిన ఇంద్రగంటి..ఇప్పుడు రోషన్‌తో సినిమాను ప్రకటించగానే ఈ కాంబినేషన్ మీద టాలీవుడ్‌లో ఆసక్తి పెరిగింది. ముఖ్యంగా రోషన్‌కు ఈ కథ మంచి అవకాశంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్..ఏడాదిన్నర కష్టానికి రూపం!
ఇప్పటి వరకూ చేసిన ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో గుర్తింపు తెచ్చుకున్న ఇంద్రగంటి మోహనకృష్ణ ఇప్పుడు పూర్తిగా భిన్నమైన జానర్‌ను ఎంచుకున్నారు. ఈ సూపర్ హీరో కథ కోసం దాదాపు ఏడాదిన్నర పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు చేసినట్లు తెలుస్తోంది. భారీ విజువల్స్, ఆధునిక సాంకేతికత, యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఇక, రోషన్‌ను కూడా గత సినిమాలకు పూర్తి భిన్నంగా కొత్త అవతారంలో చూపించబోతుండటం విశేషం.
హీరోయిన్‌గా రేఖా పాండే..
ఈ సినిమాలో రోషన్‌కు జోడీగా రేఖా పాండే నటిస్తోంది. ఆమెకు ఇది తెలుగు తెరపై తొలి సినిమా. ఈ యంగ్ బ్యూటీ బాలీవుడ్ నుంచి ఎంట్రీ ఇస్తోంది. మరో కీలక పాత్రలో వినయ్ రాయ్ కనిపించనున్నారు. సాంకేతిక విభాగంలోనూ మంచి టీమ్‌ను ఎంపిక చేశారు ఇంద్రగంటి. ఆయనకి అత్యంత సన్నిహితుడైన సినిమాటోగ్రాఫర్..పిజి విందా ఈ మూవీకి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. అలాగే, గౌరి హర సంగీతం సినిమాకి మరో ప్లస్ పాయింట్ కానుంది. ఈ డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. చూడాలి, సూపర్ హీరో కథలతో తేజ సజ్జా స్టార్ హీరో రేంజ్‌ను సాధించాడు. రోషన్‌కి ఈ సినిమా ఎలాంటి స్టార్ డమ్ తెస్తుందో.


