తెలంగాణ

TG: రూ.400 కోట్లతో రెసిడెన్షియల్‌ స్కూళ్లు.. ప్రపంచంతో పోటీ పడేలా క్లాసులు : భట్టి విక్రమార్క

5 నిమిషాల పఠనం

TG: తెలంగాణలోని ప్రతి పేద విద్యార్థి ప్రపంచంలోని అగ్రదేశాల పిల్లలతో సమానంగా పోటీపడేలా విద్యావ్యవస్థను సమూలంగా మారుస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తోందని, అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా రూ.400 కోట్ల భారీ వ్యయంతో సకల సౌకర్యాలతో కూడిన ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని వెల్లడించారు.

నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఆధునిక రెసిడెన్షియల్స్!

హనుమకొండ జిల్లా పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని కాజీపేట విద్యానగర్‌లో రూ.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 'తెలంగాణ పబ్లిక్ స్కూల్' నిర్మాణానికి బుధవారం డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో భట్టి మాట్లాడుతూ.. 'యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్' ప్రాజెక్టులో భాగంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున అత్యాధునిక రెసిడెన్షియల్ పాఠశాలలను సర్కారు ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రపంచంలోని మొదటి పది అగ్రదేశాలతో ఇక్కడి విద్యా ప్రమాణాలు పోటీపడేలా వీటిని తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.

డిజిటల్ క్లాసులు.. ప్రీప్రైమరీ నుంచే కార్పొరేట్ స్థాయి బోధన..

కుటుంబ బంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు కాజీపేటలో సెమీరెసిడెన్షియల్ విధానంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను తీసుకొస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పాఠశాలల్లో ప్రీప్రైమరీ స్థాయి నుంచే 12వ తరగతి వరకు అత్యుత్తమ విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. పూర్తి స్థాయి డిజిటల్ తరగతులు, ఆధునిక విద్యా విధానాలతో బోధన సాగుతుందని చెప్పారు. అలాగే విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం ఫ్రీగా అందిస్తామని చెప్పారు. విద్యార్థులను ఉదయం ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకొచ్చి, సాయంత్రం తిరిగి ఇంట్లోనే దిగబెట్టే ట్రాన్స్‌పోర్ట్ బాధ్యతను ప్రభుత్వమే చూసుకుంటుందన్నారు. బోధనా సిబ్బందికి పాఠశాల ఆవరణలోనే వసతి సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

ఇకపై పేదరికం కారణంగా ఏ ఒక్క విద్యార్థీ ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతోనే ఈ విద్యా విప్లవానికి శ్రీకారం చుట్టామని భట్టి విక్రమార్క తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌, కుడా ఛైర్మన్ గుండు సుధారాణి తదితర పాల్గొన్నారు.

#Telangana#Bhatti Vikramarka#Revanth Reddy#Young India Integrated Schools#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి