సినిమా

Tollywood: విశ్వంభర ఆగిపోలేదు..ఇదుగో ప్రూఫ్

4 నిమిషాల పఠనం

Tollywood: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర. ఈ సినిమా గురించి గత కొంతకాలంగా రకరకాల వార్తలు ఫిల్మ్ నగర్‌లో వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే ఆగిపోయిందని, విడుదల విషయంలో స్పష్టత లేదని, అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళ్తుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ వార్తలకు చెక్ పెట్టేలా డబ్బింగ్ వర్క్ జరుగుతున్నట్టుగా అప్‌డేట్ వచ్చి షాకిచ్చింది.

విశ్వంభర ఆగిపోయిందనే ప్రచారంలో నిజం లేదని, సినిమా టీమ్ ఇంకా పనిలోనే ఉందని చెప్పడానికి తాజా అప్‌డేట్స్ నిరూపించింది. దీంతో మెగా అభిమానులకు కొంత ఊరట లభించినట్లయింది. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. దీనికి, ప్రధాన కారణం వీఎఫెక్స్ కోసం యూవీ నుంచి బడ్జెట్ రిలీజ్ కాకపోవడమే అని ప్రచారం జరిగింది.

ఇందులో, ఎంతవరకూ నిజముందో తెలియదు గానీ, ప్రముఖ కమెడియన్ ప్రవీణ్ తాజాగా విశ్వంభర సినిమాలోని తన పాత్రకి డబ్బింగ్ చెబుతున్న పిక్‌ను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో రిలీజ్ చేశాడు. దీంతో, విశ్వంభర పనులను మేకర్స్ సైలెంట్‌గా పూర్తి చేస్తున్నట్టు తేలిపోయింది. కాబట్టి, ఖచ్చితంగా ఈ సినిమా ఆగిపోయిందన్న రుమర్స్‌లో ఎంతమాత్రం నిజం లేదు. ఎటూ, క్రిస్మస్, సంక్రాంతికి సినిమాలన్నీ డేట్ లాక్ చేసుకున్నాయి కాబట్టి..ఆ తర్వాతే విశ్వంభర విడుదల తేదీని ప్రకటించవచ్చు.

ఆల్రెడీ చిరంజీవి నటిస్తున్న కాకా చిత్రం సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ఈలోపు విశ్వంభర సినిమాకి సంబందించిన అన్నీ పనులను పూర్తి చేసి మెల్లగా ప్రమోషన్స్ ప్రారంభించనున్నారట. 2027 మార్చిలోపు భారీ స్థాయిలో రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కాగా, చాలా ఏళ్ళ తర్వాత త్రిష కృష్ణన్ మళ్ళీ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమాతో మళ్ళీ సాలీడ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశతో ఉంది. చూడాలి, మరి మెగాస్టార్ విశ్వంభర అన్నీ అడ్డంకులను తొలగించుకొని బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో.

#Vishwambhara#Megastar Chiranjeevi#Mallidi Vassishta#Trisha Krshnan#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి