తెలంగాణ

Cm Revanth reddy : మైనార్టీల ఓటు హక్కు తొలగించేందుకు కేంద్రం కుట్ర : సీఎం రేవంత్ రెడ్డి

4 నిమిషాల పఠనం

మైనార్టీల ఓట్లు తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా, మైనార్టీల స్కారల్స్‌షిప్స్ విషయంలోనూ బీజేపీ పాలిటిక్స్ చేస్తోందని సీఎం ఎద్దేవాచేశారు. బుధవారం బంజారా హిల్స్‌లోని బంజారా భవన్‌లో జాతీయ విద్యా, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు.

మైనార్టీల ఓట్లు తొలగించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా, మైనార్టీల స్కారల్స్‌షిప్స్ విషయంలోనూ బీజేపీ పాలిటిక్స్ చేస్తోందని సీఎం ఎద్దేవాచేశారు. బుధవారం బంజారా హిల్స్‌లోని బంజారా భవన్‌లో జాతీయ విద్యా, మైనారిటీ సంక్షేమ దినోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం మైనారిటీలకు అన్ని వేళలా, అన్ని రకాలుగా పూర్తి అండగా ఉంటుందని పేర్కొన్నారు.

దేశంలో విద్యా, నీటిపారుదల రంగాలకు భారత ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తుచేశారు. నెహ్రూ వేసిన బలమైన పునాదుల వల్లే నేడు విద్యా, ఇరిగేషన్ రంగాల్లో దేశం గొప్ప వృద్ధిని సాధించిందని కొనియాడారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్‌ను తొలి విద్యాశాఖ మంత్రిగా నియమించి, దేశవ్యాప్తంగా వర్సిటీలు, ఐఐటీలను కాంగ్రెస్ ప్రభుత్వమే నెలకొల్పిందని పేర్కొన్నారు.

బ్లూ కాలర్ జాబ్స్‌కు నో టెన్షన్

ప్రస్తుత కంపెనీల అవసరాలకు తగ్గట్టుగా యువతలో నైపుణ్యాలు పెరగాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. యువతలో స్కిల్స్ పెంపొందించేందుకే ఐటీఐలను ఐటీసీ (ITC)లుగా మారుస్తున్నామన్నారు. ఆధునిక వసతులతో రాష్ట్రంలో స్కిల్ వర్సిటీని కూడా నిర్మిస్తున్నట్టు చెప్పారు. ఏఐ వినియోగం పెరగడం వల్ల వైట్ కాలర్ ఉద్యోగాలకు ముప్పు ఏర్పడుతోందని, కానీ, బ్లూ కాలర్ ఉద్యోగాలకు మాత్రం ఎలాంటి ప్రమాదం ఉండబోదన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే సచార్ కమిటీ సిఫార్సుల మేరకు మైనార్టీలకు విద్య, ఉద్యోగాల్లో 4 శాతం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిందని గుర్తుచేశారు.బీజేపీ పాలిత గుజరాత్‌లో కూడా మైనార్టీ రిజర్వేషన్లు అమలువుతున్నాయని, కానీ తెలంగాణలో వాటిని తొలగిస్తామని బీజేపీ నేతలు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఎస్ఐఆర్‌‌తో ఓట్ల తొలగింపు

తెలంగాణలో మైనార్టీల ఓటు హక్కును దూరం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సీఎం మండిపడ్డారు.ఎస్ఐఆర్ పేరిట మైనార్టీలు, ఎస్టీలు, ఆదివాసీలు, నిరుపేదల ఓట్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. మైనార్టీ విద్యార్థులకు అందే స్కాలర్‌షిప్‌లపైనా కాషాయ పార్టీ రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. రాబోయే ఎన్నికల్లో ప్రధాని మోడీని ఓడించి కేంద్రంలో గద్దె దించడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమన్నారు.

#pm modi#cm revanth reddy#SIR#minority votes deletion#Telangana#congress#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి