తెలంగాణ

Congress : ఎంపీ చామల ఎపిసోడ్.. ఆగ్రహంతో ఢిల్లీకి వెళ్లిన పీసీసీ చీఫ్!

5 నిమిషాల పఠనం

కాంగ్రెస్ పార్టీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మధ్య వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపున టీవీ డిబేట్లలో పాల్గొనే మీడియా ప్యానలిస్టులు, మీడియా కో ఆర్డినేటర్లు, సీనియర్ అధికార ప్రతినిధులు, అధికార ప్రతినిధుల జాబితాను మీడియా & పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, ఎంపీ చామల విడుదల చేసిన విషయం తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మధ్య వివాదం మరింత ముదిరినట్టు తెలుస్తోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ తరపున టీవీ డిబేట్లలో పాల్గొనే మీడియా ప్యానలిస్టులు, మీడియా కో ఆర్డినేటర్లు, సీనియర్ అధికార ప్రతినిధులు, అధికార ప్రతినిధుల జాబితాను మీడియా & పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ చైర్మన్, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, చామల ఇచ్చిన ఈ నియామకాల జాబితాను వెంటనే నిలిపివేయాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు.

కమిటీలు ప్రకటించడానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు? అని టీపీసీసీ చీఫ్ మండిపడినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కంటే రేవంత్ రెడ్డి తరపున మాట్లాడే వారికే ఎంపీ చామల పదవులు ఇచ్చారని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం.చామల కిరణ్ కుమార్ రెడ్డి తనకు ఒక జాబితా చూపించి, మరో జాబితా విడుదల చేశాడని టీపీసీసీ చీఫ్ ఆరోపించడం గమనార్హం.

ఈ క్రమంలోనే వీరిరువురి మధ్య విభేదాలు మరింత ముదిరినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయి అధికార ప్రతినిధులు, టీవీ డిబేట్ ప్యానలిస్టులు, మీడియా కోఆర్డినేటర్లను నియమిస్తూ ఎంపీ చామల ఉత్తర్వులు జారీ చేయడంతో వీరి మధ్య వైరం ముదిరినట్టు టాక్. రేవంత్ కార్యాలయానికి, మహేష్ కుమార్ గౌడ్‌కు మధ్య వాడివేడిగా సంభాషణలు జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే, చామల కిరణ్ కుమార్ రెడ్డి విడుదల చేసిన జాబితా సరైనదేనని, తాము పదవుల్లో కొనసాగుతామని, వెనక్కి తగ్గేది లేదని జాబితాలోని సభ్యులు హంగామా సృష్టించినట్టు సమాచరాం. అయితే, తనకు అధికారాలు ఉన్నాయని ఎంపీ చామల వాదించినట్టు సమాచారం. అయితే, ఏఐసీసీ జాతీయ మీడియా విభాగం ప్రతినిధి పవన్ ఖేరాకు ఫిర్యాదు చేసి, మొత్తానికి చామల కిరణ్ కుమార్ రెడ్డి జారీ చేసిన ఉత్తర్వులను మహేష్ కుమార్ గౌడ్ రద్దు చేయించినట్టు తెలిసింది.

తనకు సమాచారం ఇవ్వకుండా తన పేరిట ఉత్తర్వులు జారీ చేయడంపై చామల కిరణ్ కుమార్ రెడ్డిపై పవన్ ఖేరా ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసేందుకు మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి వెళ్లినట్టు తెలిసింది. కేవలం రేవంత్ కోసమే ప్రత్యేక ప్యానెల్ నియమించేందుకు ఎంపీ చామల ప్రయత్నించాడని సీనియర్ కాంగ్రెస్ నాయకులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

#tpcc cheif mahesh goud#mp chamala kirankumar reddy#media members apointments#delhi tour#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి