Tollywood: టాలీవుడ్లో ఒకప్పుడు సంగీత దర్శకుడు అంటే ముందుగా గుర్తొచ్చే పేర్లలో మలోడి బ్రహ్మ మణి శర్మ..ఆ తర్వాత జనరేషన్లో రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఉండేవారు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు వీరిద్దరే సంగీతం అందించేవారు. కొన్నేళ్ళపాటు ఈ ఇద్దరి హవానే కొనసాగింది. ముఖ్యంగా, తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలకు ప్రత్యేకమైన బలంగా నిలిచేది. కానీ, వీరద్దు ఇప్పుడు వెనకబడ్డారు. లైన్లోకి జీవీ ప్రకాష్ కుమార్ వచ్చాడు.
థమన్ విషయంలో ఒకే తరహా ట్యూన్లు, రొటీన్ బీట్స్ అంటూ సోషల్ మీడియాలో బాగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుష్ప 2 తర్వాత దేవి కూడా బాగా స్లో అయ్యాడు. చేతిలో నాగార్జున నటిస్తున్న కింగ్ 100, తానే హీరోగా నటిస్తున్న ఎల్లమ్మ సినిమాలే ఉన్నాయి. థమన్ మ్యూజిక్ దాదాపు అందరికీ బోర్ కొట్టేసింది. దీంతో, తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్‌కు తెలుగులో వరుస అవకాశాలు దక్కుతున్నాయి. జీవీ కూడా అద్భుతమైన సాంగ్స్ ఇస్తున్నాడు. ఇరుముడి సినిమా దీనికి ఉదాహరణ.
కాపీ క్యాట్ అంటూ తమన్ మ్యూజిక్‌పై పెరుగుతున్న విమర్శలు!
తమన్ గతంలో ఎన్నో చార్ట్‌బస్టర్ ఆల్బమ్స్ అందించారు. ముఖ్యంగా.. అఖండ, అల వైకుంఠపురములో, భాగమతి, అరవింద సమేత వంటి సినిమాల్లో ఆయన సంగీతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే, వరుసగా భారీ ప్రాజెక్టులు చేస్తుండటంతో ఆయన సంగీతంలో కొత్తదనం తగ్గుతోందని కామెంట్స్ చేస్తున్నారు. ఒకరకంగా ఇది నిజం కూడా.
రీసెంట్గా వచ్చిన వెంకటేష్, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం నుంచి విడుదలైన 'మాలా' పాట విషయంలోనూ ఇదే తరహా విమర్శలు వచ్చాయి. ప్రతిరోజూ పండగే సినిమాలోని ఓ బావా మా అక్కని సక్కగా చూస్తావా.. పాట ట్యూన్‌ను గుర్తు చేసిందంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. దీంతో తమన్ మరోసారి సోషల్ మీడియా చర్చల్లోకి వచ్చారు. ఇదే, జీవీ ప్రకాష్ కుమార్‌కి తెలుగులో వరుసగా ఆఫర్స్ రావడానికి కారణం అయింది.
ప్రస్తుతం వెంకటేష్-కళ్యాణ్ రామ్-అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న జనవరి 12 విడుదలకి జీవీ మ్యూజిక్ అందిస్తున్నాడు. అలాగే, సుకుమార్ దర్శకత్వంలో చరణ్ నటించనున్న ఆర్సీ 17కి కూడా జీవీ పేరునే పరిశీలిస్తున్నారు. ఇవి కాకుండా మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ చేతిలో ఉన్నాయి. ఇక్కడ, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, జీవీ ప్రకాష్ కుమార్ తమిళ సినిమాలతో పాటు హీరోగా కూడా నటిస్తున్నాడు.
మొత్తానికి, థమన్ మ్యూజిక్ బోర్ కొట్టడంతో కొరటాల శివ-బాలయ్య సినిమాకి జీవీ లేదా అనిరుధ్ లలో ఒకరు ఫైనల్ కానున్నారు. నందమూరి థమన్ చేతి నుంచి ఎంబీకే 112 మిస్ అయ్యే ఛాన్స్ గట్టిగానే ఉంది. తాజాగా, ప్రకటించిన సుకుమార్-సిద్ధు జొన్నలగడ్డ సినిమాకి జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్సైయ్యాడు.


