జాతీయం

National : ఈవీ వెహికిల్స్‌కు పెద్దపీట.. కేంద్రం కీలక నిర్ణయం

4 నిమిషాల పఠనం

పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకం విషయంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉపయోగించే అధికారిక వాహనాల కొనుగోలు విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ట్రాన్స్‌పోర్టును ప్రోత్సహించడంతో పాటు ఇంధన దిగుమతి భారాన్ని తగ్గించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది

పెట్రోల్, డీజిల్ వాహనాల వాడకం విషయంలో కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఉపయోగించే అధికారిక వాహనాల కొనుగోలు విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ట్రాన్స్‌పోర్టును ప్రోత్సహించడంతో పాటు ఇంధన దిగుమతి భారాన్ని తగ్గించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది.ఇకమీదట ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంచేసింది.

ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం.. పాత పెట్రోల్, డీజిల్ వాహనాలను తొలగించి కొత్తవి కొనుగోలు చేసే టైంలో కేవలం ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయించారు. అందుకే ఈవీ కార్ల కొనుగోలు ధర పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచినట్టు తెలిసింది.

ఇక సాంప్రదాయ పెట్రోల్, డీజిల్, హైబ్రిడ్ కార్ల కొనుగోలు పరిమితిని రూ.10 లక్షలకే ఆర్థిక శాఖ కుదించింది. వాహనాలను సొంతంగా కొనుగోలు చేయడమే కాకుండా, అద్దెకు తీసుకునే సమయాల్లోనూ ఎలక్ట్రిక్ వాహనాలకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి.ఒకవేళ ఏదైనా ప్రభుత్వ శాఖలో ఇతర కారణాల వలన ఎలక్ట్రిక్ కార్లను ఉపయోగించడం సాధ్యపడదని భావిస్తే.. పెట్రోల్, డీజిల్ కార్ల కొనుగోలుకు ప్రత్యేక అనుమతులను తప్పనిసరి చేశారు.

దానిప్రకారమే ముందుగా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఈవీ కొనుగోలు చేయకపోవడానికి గల కారణాలు.. పెట్రోల్, డీజిల్ వాహనమే ఎందుకు వాడాల్సి ఉందో ముందుగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అది సహేతుకమైనదే అని ఆర్థికశాఖ భావిస్తే అప్పుడు క్లియరెన్స్ లభించనుంది. ఈ తతంగానికి ఆర్థిక శాఖ కార్యదర్శి, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఆమోదం తప్పనిసరి చేశారు. కాగా, ఈవీ వాడకాన్నిదేశవ్యాప్తంగా ప్రోత్సహించాలని కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించింది.

#Ev vechicles#central government#finance mininstry#national#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి