సినిమా

Ramayana: రామాయణకి ఆస్కార్ వస్తుందా..ఎంట్రీకి వెళ్ళొచ్చా?

5 నిమిషాల పఠనం

Ramayana: రామాయణకి ఆస్కార్ వస్తుందా..ఎంట్రీకి వెళ్ళొచ్చా? అనే సందేహాలు ఇప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో విరివిగా కలుగుతున్నాయి. మన టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆయన రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ దక్కింది. అయితే, ఇప్పుడు అందరూ 99వ ఆస్కార్ అవార్డ్స్‌కి రామాయాణ ఎంట్రీ ఉటుందా?.

Ramayana: రామాయణకి ఆస్కార్ వస్తుందా..ఎంట్రీకి వెళ్ళొచ్చా? అనే సందేహాలు ఇప్పుడు అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలలో విరివిగా కలుగుతున్నాయి. మన టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆయన రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఉన్న నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ దక్కింది. అయితే, ఇప్పుడు అందరూ 99వ ఆస్కార్ అవార్డ్స్‌కి రామాయాణ ఎంట్రీ ఉటుందా?..ఉంటే ఆస్కార్ దక్కుతుందా అని. ప్రయత్నాలైతే చేయొచ్చు..కానీ, ఆస్కార్ వస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేము.

మన భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత భారీ సినిమాగా తెరకెక్కిన రామాయణ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే పార్ట్ 1 రిలీజై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకొని వసూళ్ళ సునామీని సృష్టిస్తోంది. బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్ రాముడిగా, కన్నడ హీరో యష్ రావణుడిగా, టాలీవుడ్ ఫిదా బ్యూటీ సాయి పల్లవి సీతగా నటించిన ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

ఈ సినిమాకి హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, భారీ బడ్జెట్, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ఇతిహాస కథ.. ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమాకు ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. తాజా సమాచారం ప్రకారం, రామాయణ పార్ట్ 1 సినిమాను 99వ అకాడమీ అవార్డుల కోసం పరిశీలనకు మేకర్స్ సమర్పించారు. అంటే ఈ సినిమా ఆస్కార్ పరిశీలన ప్రక్రియలోకి అడుగుపెట్టినట్టే. అయితే ఆస్కార్‌కు ఎంట్రీ ఇవ్వడం, నామినేషన్ రావడం, అవార్డు గెలవడం..ఈ మూడు వేర్వేరు దశలు.

అయితే, ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది. ఇప్పటికే మరాఠీ సినిమా గోంధల్ 2027 ఆస్కార్‌లలో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగానికి భారతదేశ అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. అయినా కూడా రామాయణ పార్ట్ 1కు ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ఎందుకంటే, ఒక దేశం నుంచి అధికారికంగా ఒక సినిమానే ఇంటర్నేషనల్ ఫీచర్ విభాగానికి పంపగలిగినా, మిగిలిన సినిమాలు ఇతర విభాగాల్లో అకాడమీ నిబంధనల ప్రకారం స్వతంత్రంగా పరిశీలనకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దీన్ని బట్టి, బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ సౌండ్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్, బెస్ట్ పిక్చర్ వంటి విభాగాలలో నిబంధనల స్వంతంత్రంగా ఎంట్రీకి సమర్పించవచ్చు. చూడాలి, మరి రామాయణ పార్ట్ 1 కి ఆస్కార్ దక్కే అవకాశం ఉంటుందా లేదా. కాగా, పార్ట్ 2ను 2027 నవంబర్..దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నారు. మొత్తం రెండు భాగాలకి గానూ దాదాపు 4000 కోట్ల భారీ బడ్జెట్‌ను కేటాయించారు మేకర్స్. నితీష్ తివారీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు.

#Ramayana#Nithish Tiwari#Ranbeer Kapoor#Sai Pallavi#Ramayana 99th Oscar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి