సినిమా

Tollywood: వారణాసి, రాజమౌళిపై ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్!

4 నిమిషాల పఠనం

Tollywood: వారణాసి, రాజమౌళిపై ప్రకాష్ రాజ్ హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు అంతటా వైరల్ న్యూస్ అవుతోంది. మన సౌత్ సినిమా ఇండస్ట్రీలలో విలక్షణ నటుడిగా ఆయనకి ఎలాంటి పేరుందో అందరికీ తెలిసిందే. కనైఇ, ఎప్పుడూ ప్రకాష్ మీద ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. ఆయన కూడా ఏమాత్రం తగ్గకుండా కౌంటర్స్ ఇస్తూనే ఉన్నారు. మరోసారి, ప్రకాష్ రాక్ గ్లోబల్ సినిమా వారణాసి..ఈ సినిమాను రూపొందిస్తున్న దర్శకుడు రాజమౌళిపై చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో చర్చకు దారితీశాయి.

సౌత్‌లో విలక్షణ నటుడుగా పాపులర్ అయిన ప్రకాష్ రాజ్ మరోసారి తన సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. తన కెరీర్‌లో ఎదురైన వివాదాలు, సినీ పరిశ్రమలో తనపై జరిగిన వ్యతిరేక ప్రచారంతో పాటు ప్రస్తుతం నటిస్తున్న రాజమౌళి సినిమా వారణాసి గురించి కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వారణాసి సినిమా నుంచి తనను తొలగించాలంటూ కొందరు ప్రచారం చేశారని చెప్పడం సినీ వర్గాలలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎనిమిది సార్లు బ్యాన్ చేశారా!

తాజా ఇంటర్వ్యూలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమలో తనను గతంలో ఎనిమిది సార్లు బ్యాన్ చేశారని రివీల్ చేశారు. తనపై లేటుగా వస్తాడని, పొగరని, డబ్బింగ్‌కు సరిగ్గా రాడని రకరకాల ఆరోపణలు చేశారని తెలిపారు. అయితే, తన ప్రవర్తనలో కొన్ని తప్పులు ఉండొచ్చని, అదే సమయంలో అవతలి వాళ్ల వైపు కూడా తప్పులు ఉండొచ్చని..కాబట్టే ఇలా సమస్యలు వస్తున్నాయంటూ అభిప్రాయపడ్డారు.

ఐదు భాషల్లో సినిమాలు చేస్తూ నిరంతరం ప్రయాణాలు చేయడం వల్ల కొన్ని వ్యక్తిగత సమస్యలు ఎదురవుతాయని వివరించారు. అయినప్పటికీ, తన నటన, పని విషయంలో ఎవరూ వేలెత్తి చూపలేరని ఆయన అన్నారు. ఈ విషయంలో మాత్రం ప్రకాష్‌కి అందరూ సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే, సినిమాలో ప్రకాష్ రాజ్ ఉన్నారంటే బిజినెస్ అయిన రోజులున్నాయి. కొన్ని పాత్రలకి ఆయనే కావాలని పట్టుపట్టిన స్టార్ డైరెక్టర్స్, హీరోలు ఉన్నారు.

#Prakash Raj#SS.Rajamouli#Varanasi#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి