తెలంగాణ

TG : రెండు నెలల్లో 9 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మృతి

5 నిమిషాల పఠనం

జలమండలిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి అత్యంత దారుణంగా తయారైనట్టు తెలుస్తోంది. రెండు నెలల్లో 9 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మృతి చెందడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జలమండలిలో ఉద్యోగుల వరుస మరణాలు సంభవిస్తున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు.

జలమండలిలో ఔట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి అత్యంత దారుణంగా తయారైనట్టు తెలుస్తోంది. రెండు నెలల్లో 9 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల మృతి చెందడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జలమండలిలో ఉద్యోగుల వరుస మరణాలు సంభవిస్తున్నా ఉన్నతాధికారులు స్పందించడం లేదని ఉద్యోగులు మండిపడుతున్నారు.

తాజాగా మౌలాలి సర్కిల్‌లో మీటర్ రీడర్‌గా పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మల్లేష్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించడం హాట్ టాపిక్ అయ్యింది. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలను ఆగం చేసేలా ఇటీవల జారీ చేసిన టెండర్ ప్రక్రియపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 675 మంది మీటర్ రీడర్ల కుటుంబాలపై ఈ టెండర్ ప్రక్రియ తీవ్ర ప్రభావం చూపుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో ఉద్యోగి మరణించకముందే ఈ టెండర్ ప్రక్రియను నిలిపివేయాలని, మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర ఔట్‌సోర్సింగ్ జేఏసీ డిమాండ్ చేస్తున్నది.

అసలేంటి ఈ టెంటర్ ప్రక్రియ..

జలమండలి (HMWSSB) మీటర్ రీడర్ల ఉద్యోగ భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ ఇటీవల తీసుకొచ్చిన కొత్త కమీషన్ ఆధారిత టెండర్ ప్రక్రియపై ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత రెండు నెలల్లోనే తీవ్ర పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో దాదాపు 9 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మరణించినట్టు తెలిసింది.

కొత్త టెండర్ విధానం వల్ల దాదాపు 675 మంది మీటర్ రీడర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. అక్రమ కమీషన్ ఆధారిత టెండర్ల వల్ల ఉద్యోగుల కనీస వేతనాలకు కోత పడే ప్రమాదం ఉందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దానికితోడు ఉన్నతాధికారుల నుండి పదేపదే వచ్చే తొలగింపు బెదిరింపులు, పని ఒత్తిడి కారణంగా ఉద్యోగులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు.పని ఒత్తిడి తట్టుకోలేక గతంలో కేవలం 24 గంటల వ్యవధిలోనే ముగ్గురు ఉద్యోగులు మృతి చెందిన ఘటనలు కూడా ఉన్నట్టు తెలిసింది.

ఉద్యోగ JAC డిమాండ్లు..

మీటర్ రీడర్ల జీవితాలను అతలాకుతలం చేసే కమీషన్ ఆధారిత టెండర్ విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగ జేఏసీ డిమాండ్ చేస్తున్నది. దీనికి తోడు పదేళ్లకు పైగా పనిచేస్తున్న సిబ్బందిని తొలగించకుండా పూర్తి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతోంది.ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే ప్రతి నెలా ఒకటో తారీఖున వేతనాలు నేరుగా చెల్లించాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేసింది.కాగా, వీరి డిమాండ్లపై అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

#jalamandali#outsourcing employees#telangana#commission tender#jAC demands#swechaanews#employees deaths
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి