సినిమా

Tollywood: వరుస హిట్స్‌తో ఉన్న వెంకీ..బ్రేక్ వేసిన ఆదర్శకుటుంబం..

5 నిమిషాల పఠనం

Tollywood: విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కడతారు. గత కొంతకాలంగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న వెంకటేష్‌కు ఇటీవల వచ్చిన 'ఆదర్శ కుటుంబం' సినిమా బ్రేక్ వేసినట్టయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది.

Tollywood: విక్టరీ వెంకటేష్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఆయన సినిమా వస్తుందంటే ఫ్యామిలీ ఆడియన్స్‌ థియేటర్లకు క్యూ కడతారు. గత కొంతకాలంగా వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న వెంకటేష్‌కు ఇటీవల వచ్చిన 'ఆదర్శ కుటుంబం' సినిమా బ్రేక్ వేసినట్టయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మీద విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. కానీ, బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఆ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయింది. ఇది, పూర్తిగా త్రివిక్రమ్ ఫెయిల్యువర్ అంటున్నారు. ఈ విషయంలో వెంకీ ఫ్యాన్స్ బాగా ఫీలవుతున్నారు కూడా.

సంక్రాంతికి వస్తున్నాం, మెగాస్టార్ చిరంజీవితో చేసిన మన శంకరవరప్రసాద్‌గారు సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నాడు వెంకీ. అంతకముందు కూడా ఎఫ్ 2, ఎఫ్ 3 సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టాడు. సోలోగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఏకంగా 300 కోట్ల క్లబ్‌లో చేరాడు. కానీ, తాజాగా, వచ్చిన ఆదర్శకుటుంబం మాత్రం గట్టి దెబ్బకొట్టింది. అసలు, ఇలాంటి సినిమాను త్రివిక్రమ్-వెంకీ కాంబో నుంచి ఫ్యాన్స్ గానీ, ఇండస్ట్రీ వర్గాలు గానీ ఊహించలేదు.

లెక్క తప్పిన ఆదర్శ కుటుంబం?

అక్టోబర్ 30న విడుదలైన ఆదర్శ కుటుంబం ఫస్ట్ వీకెండ్ వరకూ మంచి వసూళ్లనే రాబట్టింది. మొదటి మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.50.95 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ అంచనాలు వెల్లడించాయి. అయితే, ఉన్నట్టుండి సోమవారం నుంచి పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

మిక్స్‌డ్ టాక్, కథ-కథనంలో లోపాలు, కామెడీ ఆశించిన స్థాయిలో లేకపోవడం వంటి అంశాలు సినిమాపై తీవ్రంగా ప్రభావం చూపినట్లు ట్రేడ్ వర్గాల విశ్లేషణలో తెలిపాయి. ముఖ్యంగా, వీకెండ్ తర్వాత కలెక్షన్లు క్రమంగా తగ్గడం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు ఆందోళన కలిగిస్తోంది. దీనికి, తోడు పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఇతిహాస గాధ రామాయణ ప్రభావం బలంగా పడింది. అయితే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. కంటెంట్ బలంగా ఉంటే ఎంత పెద్ద పాన్ ఇండియా సినిమా కూడా చిన్న సినిమా ముందు దిగదుడుపే అని గతంలో చాలా సినిమాలు నిరూపించాయి. కాబట్టి, ఆదర్శకుటుంబంలో బలమైన కథ లేకపోవడమే మైనస్. దీని, వల్ల మంచి స్వింగ్‌లో ఉన్న వెంకీకి సడన్ బ్రేక్ పడింది. బడ్జెట్‌లో సగం మాత్రమే రికవరీ అయినట్టు తెలుస్తోంది. నిర్మాతకి భారీ నష్టాలే అని చెప్పక తప్పదు.

#aadarshakutumbham#trivikram#venkatesh#srinidhi shetty#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి