సినిమా

Tollywood: మెగా ఛాన్స్ మిస్ చేసుకుంటున్న యంగ్ డైరెక్టర్స్?

5 నిమిషాల పఠనం

Tollywood: టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా చేసే అవకాశం వస్తే చాలనుకునే దర్శకులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ, పూరి జగన్నాధ్ లాంటి సీనియర్ డైరెక్టర్స్ అవకాశాన్ని దక్కించుకోలేపోతున్నారు. ఠాగూర్ లాంటి భారీ హిట్ ఇచ్చిన వినాయక్ లాంటి వాళ్ళు కొత్త తరహా కథలతో చిరును చేరలేకపోతున్నారు.

Tollywood: టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవితో ఒక్క సినిమా చేసే అవకాశం వస్తే చాలనుకునే దర్శకులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పటికీ, పూరి జగన్నాధ్ లాంటి సీనియర్ డైరెక్టర్స్ అవకాశాన్ని దక్కించుకోలేపోతున్నారు. ఠాగూర్ లాంటి భారీ హిట్ ఇచ్చిన వినాయక్ లాంటి వాళ్ళు కొత్త తరహా కథలతో చిరును చేరలేకపోతున్నారు.

ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్‌కు చిరంజీవితో సినిమా చేయడం అనేది కెరీర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్‌గా మారుతుంది. అయితే, ఇప్పుడు కొంతమంది యువ దర్శకులు మెగా ఛాన్స్‌ను అందిపుచ్చుకోవడంలో వెనుకబడుతున్నారనడంలో సందేహమే లేదు. కథలు వినిపించడం, ప్రాజెక్టులు చర్చల వరకు రావడం, ఆ తర్వాత మరో సినిమాతో బిజీ అయిపోవడం..లేదా అనూహ్యంగా ఫ్లాప్ వచ్చి చిరుతో సినిమాను మిస్ చేసుకోవడం వంటి పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.

ది ప్యారడైజ్ ఫ్లాప్ వల్ల హోల్డ్‌లో పడిన చిరు సినిమా:

దసరా లాంటి కల్ట్ సినిమాతో హిట్ కొట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీకాంత్ ఓదెల..ఆ తర్వాత మెగాస్టార్‌తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు. కానీ, మధ్యలో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా డిజాస్టర్ కావడంతో ఇప్పుడు మెగా ఛాన్స్ మిస్ అయిందనే మాట బలంగా వినిపిస్తోంది. అయితే, చిరు టాలెంట్ మాత్రమే నమ్ముతారు. శ్రీకాంత్ గనక ఓ చిన్న సినిమాతో హిట్ కొట్టి తానేంటో నిరూపించుకుంటే మళ్ళీ ఇదే మెగా ఛాన్స్ తలుపుతట్టొచ్చు.

వెంకీ కుడుమల ఇంకా ఆలస్యం ఎందుకు!

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో వెంకీ కుడుముల ఒకరు. ఈ యంగ్ డైరెక్టర్‌కి ఎప్పుడో మెగాస్టార్ ఛాన్స్ ఇచ్చారు. కానీ, ఎందుకనో వెంకీ కుడుమల ధైర్యం చేయలేకపోతున్నాడు. ఇంకా, కొన్ని యంగ్ హీరోలతో సినిమాలను చేసి ఆ తర్వాత మెగాస్టార్ వద్దకి వెళ్ళాలని భీష్మించుకు కూర్చున్నాడు. అదే, అనిల్ రావిపూడి..చక చకా ఛాన్స్ అందుకున్నాడు బ్లాక్ బస్టర్ కొట్టాడు.

వెంకీ అట్లూరికి ఇంకా అనుభవం కావాలా!

వెంకీ అట్లూరి ఇటీవల కోలీవుడ్ స్టార్ సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాను తీసి సాలీడ్ హిట్ కొట్టాడు. అంతకముందు దుల్కర్ సల్మాన్‌తో లక్కీ భాస్కర్ సినిమాను తీసి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కానీ, ఈ డైరెక్టర్‌కి చిరును డైరెక్ట్ చేసే అనుభవం ఇంకా రాలేదంటున్నాడు. ఇంకొన్ని సినిమాలు తీసి..మెగాస్టార్‌ను డైరెక్ట్ చేయగలననే నమ్మకం వచ్చాక చిరును కలుస్తాడట. కానీ, ఎప్పుడో ఆయన కోసం కథను సిద్ధం చేసుకున్నాడు. మరి, ఎందుకు ఈ యువ దర్శకులు చిరంజీవిని డైరెక్ట్ చేయాలంటే వెనకడుగు వేస్తున్నారో అర్థం కావడం లేదు.

#Tollywood#Megastar Chiranjeevi#Srikanth Odela#Venkey Atluri#Venker Kudumula
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి