తెలంగాణ

TG:తెలంగాణలో వచ్చే ఏడాది నుంచే 10+2 విధానం.. రేవంత్‌ ఆదేశాలు

5 నిమిషాల పఠనం

TG: తెలంగాణలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యావిధానానికి ప్రభుత్వం స్వస్తి పలకబోతోందా? అంటే అవుననే సంకేతాలే బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విద్యావ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్, ప్రత్యేక జూనియర్ కాలేజీల వ్యవస్థ స్థానంలో పాఠశాలల్లోనే ‘10+2’ విధానాన్ని తీసుకొచ్చేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసింది.

TG: తెలంగాణలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఇంటర్మీడియట్ విద్యావిధానానికి ప్రభుత్వం స్వస్తి పలకబోతోందా? అంటే అవుననే సంకేతాలే బలంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర విద్యావ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్, ప్రత్యేక జూనియర్ కాలేజీల వ్యవస్థ స్థానంలో పాఠశాలల్లోనే ‘10+2’ విధానాన్ని తీసుకొచ్చేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచే ఈ సరికొత్త 10+2 విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సచివాలయంలో విద్యాశాఖపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇంటర్‌కు చెక్.. స్కూళ్లలోనే 12వ తరగతి వరకు బోధన

దశాబ్దాలుగా ఉన్న 10వ తరగతి వరకు పాఠశాల విద్య, ఆ తర్వాత రెండేళ్ల ఇంటర్మీడియట్ వ్యవస్థ స్థానంలో ఇకపై నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అంతా ఒకే గొడుగు కిందకు రానుంది. ఆధునిక అవసరాలకు తగినట్లుగా విద్యావిధానంలో మార్పులు తేవాల్సిందేనని తేల్చిచెప్పిన ముఖ్యమంత్రి, ఏ ఒక్క విద్యార్థికి నష్టం జరగకుండా నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, 12వ తరగతి వరకు బోధనను అక్కడే పూర్తిస్థాయిలో అందించేలా మార్పులు తీసుకురావాలని ఆదేశించారు.

9 నుంచి 12 వరకు ‘స్పెషలైజ్డ్ ఎడ్యుకేషన్’..

ఈ నూతన విధానంలో భాగంగా 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులను ప్రత్యేక కేటగిరీగా పరిగణించనున్నారు. 9 నుంచి 12వ తరగతి వరకు ఉన్న విద్యను ‘ఉన్నత విద్య’గా పరిగణిస్తూ, విద్యార్థులకు ప్రత్యేక విద్యను అందించనున్నారు. విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేసుకునే సమయానికి కేవలం పుస్తక పరిజ్ఞానమే కాకుండా, ఉద్యోగ, ఉపాధి మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు సాధించేలా ప్రత్యేక దృష్టి పెడతారు. 10+2 విధానానికి అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు కె. కేశవరావు, సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సహా పలువురు విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది నుంచే అమలులోకి రానున్న ఈ 10+2 నిర్ణయంతో తెలంగాణలో ఇంటర్ బోర్డు భవితవ్యం, విద్యా స్వరూపంపై సరికొత్త చర్చ మొదలైంది.

#Telangana#Telangana Education#10+2 Education System#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి