తెలంగాణ

TG: రూ.1,000 కోట్ల బీసీ స్టడీ సర్కిల్ భూమి ప్రైవేట్ పరం.. రేవంత్ సర్కార్‌పై దాసోజు శ్రవణ్ ధ్వజం!

6 నిమిషాల పఠనం

TG: తెలంగాణలో బీసీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా బడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

TG: తెలంగాణలో బీసీ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్దేశించిన వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడ్డగోలుగా బడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిందని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేద బహుజన బిడ్డల ఆత్మగౌరవాన్ని, వారి విద్యావకాశాలను తుంగలో తొక్కుతూ కార్పొరేట్ శక్తులకు మేలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. బుధవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కురువ విజయ్ కుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ కుంభకోణానికి సంబంధించిన వివరాలను బయటపెట్టారు.

బీసీల హక్కును కాలరాచి ప్రైవేట్ సంస్థకు నజరానా

హైదరాబాద్ నగరంలోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని సర్వే నెంబర్ 20/1 లో ఉన్న 3 ఎకరాల 17 గుంటల విలువైన స్థలాన్ని ‘ఎస్ఏఎస్ ఇన్‌ఫ్రా’ (SAS Infra) సంస్థకు దారాదత్తం చేశారని శ్రవణ్ ఆరోపించారు. 2013లో నాటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీసీ విద్యార్థుల అభ్యున్నతి కోసం ఇక్కడ ‘బీసీ స్టడీ సర్కిల్’ భవనాన్ని నిర్మించేందుకు ఈ భూమిని కేటాయించారని గుర్తుచేశారు. నేడు మార్కెట్‌లో సుమారు రూ. 1,000 కోట్లకు పైగా విలువ పలికే ఈ ప్రభుత్వ ఆస్తిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం వెనుక బహుజనులకు జరిగిన తీరని అన్యాయం దాగి ఉందని నిప్పులు చెరిగారు.

రికార్డులు తారుమారు..

ఈ భూమి వ్యవహారంలో గతంలోనే అనేక అక్రమాలు తేలాయని శ్రవణ్ రికార్డులను ప్రస్తావించారు. సదరు SAS Infra సంస్థ ప్రభుత్వ భూమిని అనధికారికంగా ఆక్రమించిందని స్పష్టం చేస్తూ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ 2020లోనే లేఖ రాశారని, దాదాపు రూ.1.93 కోట్ల జరిమానా విధించి స్థలాన్ని ఖాళీ చేయించాలని ఆదేశించినా చర్యలు తీసుకోలేదని తెలిపారు. నారాయణ రెడ్డి కలెక్టర్‌గా ఉన్న సమయంలో ఈ భూమిని నిషేధిత ఆస్తుల జాబితా (22-A)లో చేర్చారని, అలాంటి వివాదాస్పద భూమి ఎలాంటి టైటిల్ వెరిఫికేషన్ లేకుండా ప్రైవేట్ కంపెనీ పేరుతో ఎలా రిజిస్టర్ అయిందని ప్రశ్నించారు. ప్రభుత్వ రికార్డులను పక్కనపెట్టి, రూల్స్‌లో తుంగలో తొక్కి హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, హైడ్రా పరిధిలో స్కైస్క్రాపర్స్ నిర్మాణాలకు క్లియరెన్సులు ఇవ్వడం వెనుక ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయని ఆరోపించారు.

బీసీ మంత్రులు ఎందుకు మౌనంగా ఉన్నారు?

ప్రజాప్రతినిధులు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, సంబంధిత అధికారులకు లేఖలు రాసినా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. సామాన్యుల నిర్మాణాలపై దూకుడు ప్రదర్శించే హైడ్రా, వేల కోట్ల ప్రభుత్వ భూములు, చెరువుల ఎఫ్‌టీఎల్ పరిధులను మింగేస్తున్న బడా రియల్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. రాష్ట్ర కేబినెట్‌లోని బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు వి.హనుమంతరావు ఈ దోపిడీపై స్పందించి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వెంటనే SAS Infraకు ఇచ్చిన అన్ని అనుమతులను రద్దు చేసి, ఆ భూమిని తిరిగి బీసీ స్టడీ సర్కిల్‌కు కేటాయించే వరకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు.

#Telangana#Telangana News#D former? BRS#BRS Party#Dasoju Sravan#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి