సినిమా

January 12 Vidudala: ఊహించని ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..ఏకంగా అమెరికాలో సినిమా ప్రమోషన్స్

4 నిమిషాల పఠనం

January 12 Vidudala: టాలీవుడ్‌లో సినిమా ప్రమోషన్స్‌కు కొత్త ఒరవడి సృష్టించిన దర్శకుడు అనిల్ రావిపూడి. తన సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లడంలో ఆయన ఎప్పుడూ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. సాధారణంగా సినిమా విడుదలకు ముందు హైదరాబాద్, ఇతర ప్రధాన నగరాల్లో ప్రమోషన్స్ నిర్వహించడం చూశాం. కానీ, అనిల్ రావిపూడి మాత్రం ఈసారి తన ప్లాన్‌ను మరింత విస్తరించబోతున్నారు. ఏకంగా అమెరికాలోనూ సినిమా ప్రమోషన్స్ నిర్వహించాలనే ఆలోచన ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న జనవరి 12 విడుదల సినిమాలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నారు. కీర్తి సురేష్, కృతిశెట్టి హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక, ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. టైటిల్ కూడా అదే కావడంతో అభిమానుల్లో, ప్రేక్షకుల్లో రెట్టింపు స్థాయిలో అంచనాలు పెరిగాయి.

పటాస్ నుంచి అనిల్ రావిపూడి సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్‌లో లూడా మంచి ఆదరణ దక్కుతోంది. ముఖ్యంగా అమెరికాలో తెలుగు ప్రేక్షకులు ఎక్కువగా ఉండటంతో అక్కడి మార్కెట్‌ను టార్గెట్ చేయడం సహజమే. ఈ నేపథ్యంలోనే ఈసారి అక్కడ ప్రత్యేకంగా ప్రమోషన్స్ నిర్వహిస్తే సినిమాకు మరింత బజ్ వచ్చే అవకాశం ఉంటుందని..హీరో హీరోయిన్స్ సహా మిగతా చిత్ర యూనిట్‌తో అమెరికాలో ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేశాడు. డిసెంబర్ 26, 27 తేదీలల్లో చికాగోలో, అలాగే.. డిసెంబర్ 29, 30, 31 తేదీలల్లో ఆస్టిన్ తో పాటు డల్లాస్ నగరాల్లో ఈ ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

ఇది ఎవరూ ఊహించలేదు:

అనిల్ రావిపూడి ఇలా దేశాన్ని దాటి జనవరి 12 విడుదల చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తాడని ఏ ఒక్కరూ ఊహించి ఉండరు. కంటెంట్ బలంగా ఉంటే ప్రమోషన్స్‌కు భారీగానే ఖర్చు చేయిస్తుంటాడు. ఇదే విషయాన్ని స్వయంగా అనిల్ కూడా వెల్లడించాడు. ఇండియాలో..అది కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో అంటే అది అంత గొప్పేమి కాదు. కానీ, అమెరికాలో ప్రమోషనల్ టూర్ అంటే అనిల్ ఈసారి గట్టిగానే ప్లాన్ చేశాడనిపిస్తోంది. మరి, ఈసారి బాక్సాఫీస్ లెక్కలను ఎలా నమోదు చేయబోతున్నాడో చూడాలి.

#january-12-vidudala Promotions#Anil Ravipudi#Venkatesh#Krthi Setty#Kalyan Ram#Keerthy Suresh
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి