తెలంగాణ

Telangan: సన్న బియ్యం పథకంలో కొత్త చిక్కులు.. ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన మిల్లర్ల వ్యవహారం!!..

రచన: Venu••11 నిమిషాల పఠనం

తొండ ముదిరితే ఊసర వెళ్లి అవుతుందని పెద్దలు చెబుతుంటారు. తెలంగాణలో మిల్లర్లు కూడా అలాగే మారుతున్నారనే ఆరోపణలున్నాయి.. టూకీగా చెప్పాలంటే కుక్క తోకను ఆడించాలి కాని తోకే కుక్కను ఆడించొద్దంటారు. ఇక్కడ అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఆడిస్తామని చెప్పినట్లుగానే మిల్లర్లు ప్రభుత్వానికి చుక్కలు చూపించే స్ధాయికి చేరుకున్నట్టు ఆరోపణలున్నాయి.

తొండ ముదిరితే ఊసర వెళ్లి అవుతుందని పెద్దలు చెబుతుంటారు. తెలంగాణలో మిల్లర్లు కూడా అలాగే మారుతున్నారనే ఆరోపణలున్నాయి.. టూకీగా చెప్పాలంటే కుక్క తోకను ఆడించాలి కాని తోకే కుక్కను ఆడించొద్దంటారు. ఇక్కడ అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వాన్ని ఆడిస్తామని చెప్పినట్లుగానే మిల్లర్లు ప్రభుత్వానికి చుక్కలు చూపించే స్ధాయికి చేరుకున్నట్టు ఆరోపణలున్నాయి.

మరోవైపు రాష్ట్రంలో ప్రభుత్వం ఉదాసీనత మిల్లర్లకు వరంగా మారిందని అంటున్నారు.. ఇప్పటికే లంచాలకు మరిగిన అధికారుల తీరు మిల్లర్లకు వరంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకానికి తూట్లు పొడిచేలా మిల్లర్లు ఎత్తులు వేస్తున్నట్టు విమర్శలున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం చర్చలకు దారితీస్తుంది.

మిల్లర్లు గనుక ప్రభుత్వానికి సకాలంలో బియ్యం ఇయ్యకపోతే సన్నబియ్యం పథకం చిక్కుల్లో పడుతుంది. గతంలో ప్రభుత్వానికి సవాళు విసిరిన మిల్లర్లు ఆ దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం ఇప్పుడు జోరందుకుంది. ఇక గత పన్నెండేళ్ళుగా మిల్లర్లు అందినకాడికి అందినట్టు దోచుకుంటున్నారని, లెక్క పత్రం లేకుండా కోట్లు కూడబెట్టుకున్నారనే తీవ్ర విమర్శలున్నాయి. అయినా అధికారులు మొద్దు నిద్రలో ఉండటం.. ప్రభుత్వం అబాసు పాలు కావడానికి మిల్లర్లకు తోడుగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అయితే ప్రభుత్వం వడ్లు ఇవ్వడం మిల్లర్లు అమ్ముకొని సొమ్ము చేసుకోవడం అనే వ్యవహారం ఎప్పటి నుంచో జరుగుతూనే వుంది. ప్రభుత్వానికి పావలా చెల్లించి, మిగిలింది అంతా జేబులో వేసుకుంటూన్నారనే ఆరోపణలు ఉన్నా అధికారులు మాత్రం చర్యలు నామమాత్రంగా తీసుకుని హడావుడి చేస్తున్నారనే విమర్శలున్నాయి.. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరో అడుగు ముందుకేసిన మిల్లర్లూ.. ఇప్పుడు అధిక సంపాదన కోసం ఆలోచన చేస్తున్నారని అంటున్నారు..

మిల్లర్ల నుంచి బకాయిలు వసూలు చేయాలనుకుంటే ప్రభుత్వానికే చుక్కలు చూపిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. మిల్లుల మీద ఫిజికల్ వెరిఫికేషన్ వద్దని మిల్లర్లు వారిస్తూ.. ప్రభుత్వానికే అల్టిమేటమ్ జారీ చేసే దాకా వచ్చారంటే.. మిల్లర్ల వ్యవస్థ ఎంత బలపడిందో అర్థం అవుతుందని అంటున్నారు. అంతా ఏకమై ఏకంగా మిల్లులను మూసిసేస్తామని బ్లాక్ మెయిల్ చేయడంతో.. ప్రభుత్వం కాస్తా దిగి వచ్చే సరికి మొత్తం వ్యవస్ధనే గుప్పిట్లో పెట్టుకునేందుకు మిలర్లు సిద్దమయ్యారని అంటున్నారు..

మరోవైపు ప్రభుత్వం ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తున్న సమయంలో మిల్లర్ల నాయకులంతా కలసి తమ వద్ద 75లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వుందని చెప్పారు. ఆ ధాన్యాన్ని బియ్యం చేస్తే కనీసం 60లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తుంది. కాని ఆ బియ్యం ఇంకా ప్రభుత్వానికి ఇవ్వలేదనే ఆరోపణలున్నాయి. అయితే ఇటీవల ప్రభుత్వం ఎఫ్‌సిఐ ద్వారా 16లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనుగోలు చేయాలని భావించింది..

ఆ బియ్యం మిల్లర్ల నుంచి సేకరించి ఇవ్వాలనుకుంది. అయితే ఇక్కడ మిల్లర్లు మరో తిరకాసు పెట్టారు. ఎఫ్‌సిఐకి సన్నబియ్యం, దొడ్డు బియ్యం అనే తేడా చూడదు. అందువల్ల తాము దొడ్డు బియ్యం ఇస్తామని అందుకు ప్రభుత్వం నుంచి జీవో జారీ చేయాలని వారు కోరగా ప్రభుత్వం అంగీకరించినట్టు ప్రచారం జరుగుతుంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావం ఉన్న నేపథ్యంలో ఈసారి వరి సాగు దిగుబడి గణనీయంగా తగ్గే ప్రమాదం వుందనే హెచ్చరికలున్నాయి..

ఈ క్రమంలో బహిరంగ మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు విపరీతం పెరిగాయి. దాంతో మిల్లర్ల వద్దు వున్న 75లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని బియ్యం చేసి అమ్ముకునేందుకు మిల్లర్లు ప్రణాళికలు రచిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ విషయాన్ని పసిగట్టని ప్రభుత్వం పదహారు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తీసుకునేందుకు అంగీకరించింది. అందులోనూ దొడ్డు బియ్యం అయినా సరే అని ఒప్ప్పుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.

దాంతో ముందు జాగ్రత్తగా మిల్లర్లు ఇతర రాష్ట్రాల నుంచి పెద్దఎత్తున సాధారణ రకం దొడ్డు బియ్యం కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఆ బియ్యం ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.. మరోవైపు గత రెండు సంవత్సరాలలో వచ్చినంత వరి దిగుబడి ఈసారి లేదు. ప్రభుత్వమే వరి పంట ఎక్కువగా వెయ్యొద్దని వెల్లడిస్తుంది. దాంతో రైతులు కూడా నీళ్లు అందకపోవడంతో వరి సాగు తగ్గించారు.

ఈ క్రమంలో సుమారు 40శాతానికి పైగా వరి సాగు తగ్గినట్లు కనిపిస్తోంది. అలాగే ఇప్ప్పుడిప్ప్పుడే తెలంగాణలో వరికోతలు మొదలాయ్యాయి. కొన్ని జిల్లాల్లో ఇంకా కోతకు కూడా వరి రాలేదు. కాని మిల్లర్లు రైతుల వద్దకు వాలిపోయి.. వారికి ముందే డబ్బులు చెల్లిస్తున్నారని అంటున్నారు.. చివరికి పచ్చి ధాన్యమైనా సరే తీసుకుంటామని రైతులతో బేరం కుదుర్చుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు..

ఒకవైపు సన్న బియ్యం ధర వందకు చేరువ అవుతుంది.. రానున్న రోజుల్లో 120 కి చేసిన ఆశ్చర్యపోనవసరం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే రబీ సీజన్‌లో ఖరీప్ కంటే చాలా తక్కువ వరి వస్తుంది? అందుకే ప్రస్తుతం రికార్డు ధరలు చెల్లించి మిల్లర్లు సన్న ధాన్యం కొనుగోలు చేస్తున్నారని అనుకుంటున్నారు.. ఇక ప్రజలకు రేషన్ కార్డుల ద్వారా ఇస్తున్న సన్న బియ్యానికి కొరత వచ్చే దాకా మిల్లర్లు ఆ బియ్యాన్ని కాపాడుకుంటారని తెలుస్తుంది.

ప్రభుత్వానికి తీరా అవసరమైనప్ప్పుడు మార్కెట్ రేటుకు అమ్ముకునేందుకు పథకం రచిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇక ఇటు ప్రజలైనా, అటు ప్రభుత్వమైనా సరే మిల్లర్లు చెప్పిన ధరకు బియ్యం కొనుగోలు చేసుకోవాల్సిందే.. అందుకే మిల్లర్లు ముందుగానే వడ్లు కొంటున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.. అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం సన్న బియ్యం కొనుగోలు చేసే పరిస్దితి వచ్చేలా మిల్లర్లు తమ వ్యాపార తెలివి తేటలను చూపించేందుకు పధకం రచించారని ముచ్చటించుకుంటున్నారు.

ఇలాగే ఓ రెండు సంవత్సరాలు ఎల్‌నినో కొనసాగితే, ప్రభుత్వం వద్ద బియ్యం లేకుండాపోతాయి. బియ్యం పధకం కేంద్రానిదే అయినా సన్న బియ్యం పధకం రాష్ట్ర ప్రభుత్వానిది. ఎట్టి పరిస్దితుల్లో ప్రభుత్వం ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాల్సిందే. లేకుంటే ప్రతిపక్షాల ముందు విమర్శలు ఎదుర్కొవాల్సిందే. అలాగే ప్రజలకు సమాధానం కూడా చెప్ప్పుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అప్ప్పుడు మిల్లర్లదే పై చేయి అవుతుంది.

ప్రభుత్వం ప్రజలకిచ్చే సన్న బియ్యం మేమిస్తేగాని పాలకులు పధకం అమలు చేయలేరనే స్ధితికి తీసుకొచ్చేలా మిల్లర్లు పావులు కదుపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవకపోతే మొదటికే మోసం వస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. ఇక సన్నబియ్యం పథకం అమలు చేయలేకపోతే అటు ప్రజలకు, ఇటు ప్రతిపక్షాలకు ప్రభుత్వం సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి తలెత్తుతుంది. ఇక ప్రభుత్వ పెద్దలు త్వరగా తేరుకుని, ఎల్‌నినో కంటే మిల్లర్లు ప్రమాదరకమని గుర్తిస్తే గాని ఈ గండం నుంచి బైటపడే అవకాశం లేదంటున్నారు.

#FineRiceScheme#RiceMillersSyndicate#CMRScam#TelanganaPolitics#PDSFoodScam#RiceMillersIssue#GovernmentVsMillers#NewsAnalysis
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి