క్రైమ్

Ram Reddy: రంగారెడ్డి జిల్లాలో విషాదం.. ప్రముఖ రియల్టర్ ఆత్మహత్య

రచన: NK3 నిమిషాల పఠనం

Ram Reddy: రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ లో ప్రముఖ రియల్టర్, హోమ్ ల్యాండ్ సంస్థ అధినేత రాంరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. కందుకూరు మండలం నేదునూరులోని తన ఫామ్‌హౌస్‌లో ఆయన ఉరి వేసుకున్నారు. పటాన్‌చెరులో 280 ఎకరాల్లో రాంరెడ్డి నూతన వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వెంచర్ కు సంబంధించి తలెత్తిన వివాదాలు, రాజకీయ నాయకుల ఒత్తిళ్లతో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

పటాన్‌చెరులో 280 ఎకరాల్లో ఒక భారీ వెంచర్‌ను రాంరెడ్డి ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కొందరు రాజకీయ నాయకుల నుంచి ఆయనపై తీవ్ర ఒత్తిడి ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఒత్తిళ్లను తట్టుకోలేకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు అసలు కారణం ఏంటో తెలుసుకుంటామన్నారు. రాంరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్‌ మణికొండలో రాంరెడ్డి నివాసం ఉంటున్నారు. 2018లో పటాన్‌చెరు ప్రాంతంలో సుమారు 280 ఎకరాల్లో వెంచర్ చేపట్టారు. అయితే ఆ భూమికి సంబంధించిన వివాదాలతో వెంచర్ అభివృద్ధి ఆలస్యమైనట్లు సమాచారం. ఆ వివాదాలు పరిష్కరించేందుకు రాంరెడ్డి భారీగా అప్పులు చేశారని తెలుస్తోంది. వెంచర్ ఆలస్యం కావడం, ఆర్థిక భారం పెరిగిపోవడంతో ఆయన తీవ్ర ఒత్తిడికి లోనైనట్లు సమాచారం.

#Realtor Ram Reddy#Ends Life#Ranga Reddy#Home Land#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి