తెలంగాణ

బీఆర్ఎస్‌ కుట్రలను ప్రజలకు వివరించాలి- సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్

రచన: Mahesh6 నిమిషాల పఠనం

TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వాడి వేడిగా జరుగుతోంది. ఈ రోజు అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం.. పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు. ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని వారికి సూచించారు.

TG: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం వాడీవేడిగా జరుగుతోంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రభుత్వ పాలన, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలన్నారు.

అయితే ఈ సమావేశంలో గులాబీ పార్టీపై రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. “బీఆర్ఎస్‌కు అధికారం పోయినా అహంకారం పోలేదు” అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం కుట్ర చేసిందని ఆరోపించారు.

సభ జరగనివ్వకుండా కుట్ర..

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనను పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పటివరకు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నామని రేవంత్‌ తెలిపారు. అయితే సభ సజావుగా సాగకుండా బీఆర్ఎస్ అడ్డంకులు సృష్టిస్తోందని మండిపడ్డారు.

పోలీసులను, ప్రజాప్రతినిధులను దూషించడం ద్వారా గులాబీ పార్టీ నాయకులు సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించారని సీఎం ఫైర్ అయ్యారు. మహిళా అధికారుల ముందు టీషర్టులు విప్పి ఇబ్బందికర పరిస్థితులు సృష్టించారని అన్నారు. అంతేకాకుండా స్పీకర్‌ను అభ్యంతరకరమైన రీతిలో దూషించారని ధ్వజమెత్తారు.

కుట్రలను తిప్పికొట్టాలి

ప్రతిపక్ష నాయకులు చేస్తున్న అక్రమ ఆరోపణలు, కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా తిప్పికొట్టాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి రేవంత్. ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలకు వాస్తవాలతో సహా వివరించాలని సూచించారు. ఇప్పటివరకు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేసిన ఎమ్మెల్యేలను రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఇకపై కూడా ప్రతి ఎమ్మెల్యే అసెంబ్లీ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరై చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని సూచించారు.

ప్రజల్లోకి ‘వెయ్యి రోజుల’ పాలన

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇప్పటివరకు చేసిన అభివృద్ధి పనులను, వెయ్యి రోజుల పాలనలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. వెయ్యి రోజుల పాలనకు సహకరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు, మీ సహకారంతో దేశంలో ఎక్కడా లేని విధంగా కార్యక్రమాలు తీసుకువచ్చామని పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్ అన్నారు.

SIR పేరుతో ఓట్లు తొలగించే కుట్ర

SIR పేరుతో ఓట్లు తొలగించే కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలవాలనుకునే ప్రతీ ఒక్కరు ఈ ఓటు హక్కును కాపాడే అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలన్నారు. మీ ప్రతి ప్రవర్తన, వ్యక్తిగత పనితీరు మీ గెలుపోటములను ప్రభావితం చేస్తుందని ఎమ్మెల్యేలను హెచ్చరించారు. SIR అంశాన్ని సీరియస్ గా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

దేశంలో వయోజనుల జనాభా 103 కోట్లుగా తేల్చారు, కానీ ఓటర్ల జాబితా మాత్రం 88 కోట్లుగా చూపుతున్నారని రేవంత్ అన్నారు. అంటే దేశంలో 15 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయని, ఎక్కడో ఏదో ప్రమాదం పొంచి ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

#Revanth Reddy#Telangana CM#Telangana Politics#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి