తెలంగాణ

KTR: ఇదీ.. కాంగ్రెస్ తెచ్చిన మార్పు-సీఎం రేవంత్ సొంతూరులో రైతుల నిరసనపై కేటీఆర్ సెటైర్

రచన: NK3 నిమిషాల పఠనం

KTR: సీఎం రేవంత్‌ రెడ్డి స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి సమీపంలో శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై రైతులు మెరుపు ధర్నా చేపట్టడం కలకలం రేపుతోంది. తమ పొలాలకు విద్యుత్, సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతన్నలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలన్నీ ఎండిపాయే నగాదారిలో’ అంటూ పాటలు పాడుతూ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

వ్యవసాయానికి రోజూ కేవలం 6 నుంచి 8 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని.. అది కూడా నాణ్యత లేకపోవడం వల్ల మోటర్లు, స్టార్టర్లు కాలిపోయి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు మాట తప్పారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంటలన్నీ ఎ

కొండారెడ్డిపల్లి రైతుల నిరసనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ లో స్పందించారు. రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని విమర్శించారు. సీఎం రేవంత్ సొంతూరు కొండారెడ్డిపల్లి రైతులు ఆవేదన చూడండి అంటూ రైతులు నిరసన తెలిపిన వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారాయన. కాంగ్రెస్ తీసుకొచ్చిన మార్పు ఇదే అంటూ సెటైర్ వేశారు కేటీఆర్.

#KTR#Brs#Farmers#Protest#Power#Water#Swechaa News#Kondareddypalli#Kondareddypalli Farmers Protest
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి