తెలంగాణ

TG : ఫ్లాష్‌ సర్వే చేయించాం.. బీఆర్‌ఎస్‌దే తప్పని ప్రజలు చెప్తున్నారు : సీఎం రేవంత్

రచన: Mahesh6 నిమిషాల పఠనం

TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తాజాగా మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. గత మూడు రోజులుగా అసెంబ్లీ కేంద్రంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రభుత్వం నిర్వహించినట్లు చెబుతున్న ఫ్లాష్ సర్వే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వే ఫలితాలను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలతో పంచుకున్నారు.

TG : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ తాజాగా మరో ఆసక్తికర పరిణామం తెరపైకి వచ్చింది. గత మూడు రోజులుగా అసెంబ్లీ కేంద్రంగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రభుత్వం నిర్వహించినట్లు చెబుతున్న ఫ్లాష్ సర్వే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సర్వే ఫలితాలను స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలతో పంచుకున్నారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం అధ్యక్షతన సీఎల్పీ భేటీ జరిగింది. ఇందులో తాజా రాజకీయ పరిణామాలు, బీఆర్ఎస్ వ్యవహారశైలి, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై రేవంత్‌ చర్చించారు.

బీఆర్ఎస్ తీరునే ప్రజలు తప్పుబట్టారు

ఈ సమావేశంలో ఫ్లాష్ సర్వే వివరాలను ఎమ్మెల్యేలకు వివరించారు సీఎం రేవంత్. గత మూడు రోజులుగా అసెంబ్లీ వద్ద జరిగిన పరిణామాలపై ప్రజల రెస్పాన్స్‌ను ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేసిందన్నారు. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ నేతల వ్యవహారశైలినే ప్రజలు తప్పుబట్టారని, ప్రభుత్వంపై మాత్రం పెద్దగా వ్యతిరేకత కనిపించలేదని సర్వేలో తేలినట్లు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

ఇది నిజమైతే.. అసెంబ్లీ వేదికగా గులాబీ పార్టీ చేస్తున్న ఆందోళనలు, ఆరోపణలు.. బీఆర్ఎస్‌కే రాజకీయంగా నష్టం చేస్తున్నాయా? అనే చర్చకు తెరలేపినట్లైంది.

ఆ మూడు రోజుల పరిణామాలపై ఫోకస్

ఈ నెల 7న అసెంబ్లీ గేటు వద్ద చోటుచేసుకున్న పరిణామాలను సమావేశంలో ప్రస్తావించారు రేవంత్. ఆ తర్వాత సభలో జరిగిన పరిణామాలు, స్పీకర్‌పై చేసిన కామెంట్స్, ఎర్రవల్లిలో చోటుచేసుకున్న శుద్ధీకరణ వ్యవహారం తదితర అంశాలను కూడా ఆయన సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలకు వివరించారు. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లారు.

ఎమ్మెల్యేలకు కీలక సూచనలు

బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలను రాజకీయంగా ఎదుర్కొనేందుకు ఎమ్మెల్యేలు మరింత చురుగ్గా వ్యవహరించాలని సీఎం సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ వేదికగా జరుగుతున్న పరిణామాలపై ప్రజల్లోకి వెళ్లేటప్పుడు ప్రభుత్వం వాదనను బలంగా వినిపించాలని సీఎం స్పష్టం చేశారు.

సర్వే ఫలితాలు నిజంగా ప్రభావం చూపిస్తాయా?

అసెంబ్లీ సమావేశాల టైంలో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ పోరు తీవ్రతరమైన వేళ ఈ ఫ్లాష్ సర్వే అంశం తెరపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని, బీఆర్ఎస్ తీరుపైనే ప్రజల్లో అసంతృప్తి ఉందని సర్వేలో తేలిందంటూ సీఎం చెప్పడం కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త జోష్‌ నింపే అంశంగా మారింది.

అయితే ఇది ప్రభుత్వం అంతర్గతంగా నిర్వహించిన ఫ్లాష్ సర్వేకు సంబంధించిన సమాచారం కావడంతో.. దాని పూర్తి వివరాలు, నమూనా, సర్వే విధానం వంటి అంశాలు బయటకు వస్తేనే ప్రజాభిప్రాయంపై స్పష్టమైన అంచనాకు వచ్చే అవకాశం ఉంటుందనే వాదన వినిపిస్తోంది.

మొత్తంగా.. అసెంబ్లీ రచ్చను తమకు అనుకూలంగా మలుచుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రయత్నిస్తున్న వేళ.. “ప్రభుత్వంపై యాంటీ లేదు.. బీఆర్ఎస్ తీరునే ప్రజలు తప్పుబట్టారు” అన్న రేవంత్‌ కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపాయి.

#Revanth Reddy#Telangana CM#Telangana Politics#Congress#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి