తెలంగాణ

Harish Rao: ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవు- హరీశ్ రావు

రచన: NK5 నిమిషాల పఠనం

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు కరెంటు కోసం, నీళ్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు పోతున్నాయని ఆరోపించారు.

Harish Rao: కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు కరెంటు కోసం, నీళ్ల కోసం రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఆంధ్రప్రదేశ్ కు పోతున్నాయని ఆరోపించారు. తెలంగాణలో పంటలు ఎండిపోతుంటే కృష్ణా జలాలను ఏపీకి వదులుతున్నారని చెప్పారు. కళ్ల ముందు నీళ్లు పారుతున్నా పొలాలకు నీళ్లు ఇవ్వలేని పాలన రాష్ట్రంలో సాగుతోందన్నారు. కల్వకుర్తిలో 3 మోటార్లు ఎందుకు బంద్ పెట్టారు? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు హరీశ్ రావు.

పాలమూరు రైతులకు వెన్నుపోటు పొడిచారు

కరెంట్ కోసం, నీళ్ల కోసం రైతులు ధర్నాలు చేయటం బాధాకరం అని హరీశ్ రావు వాపోయారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. రేవంత్ తెచ్చిన కరవు అంటూ ధ్వజమెత్తారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే అర్హత రేవంత్ కు లేదన్నారు. పాలమూరు రైతులకు రేవంత్ వెన్నుపోటు పొడిచారని హరీశ్ రావు అన్నారు. కాంగ్రెస్ సర్కార్ ప్రాజెక్టులకు పట్టించుకోవడం లేదన్నారు. ఎన్ నినో ప్రభావం ఉన్నా రేవంత్ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా?

దేశమంతా ఎల్ నినో ప్రభావం ఉందని.. ఈ తరుణంలో చుక్క చుక్క నీటిని కూడా ఒడిసిపట్టాలన్నారు. కానీ రేవంత్ ప్రభుత్వానికి అదేమీ పట్టడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ కు నీళ్లు ఫుల్ అయితే, తెలంగాణలో నీళ్లు నిల్ అని హరీశ్ రావు అన్నారు. ఏపీకి నీళ్లు వదిలి చంద్రబాబుకు రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా? అని నిలదీశారు. మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతులు సాగు నీటి కోసం అల్లాడుతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా నదీ జలాలు కళ్ల ముందు కనిపిస్తున్నా ఎత్తిపోయడం లేదన్నారు.

కేసులు, అరెస్టులు, సస్పెన్షన్లపైనే ఫోకస్..

ముఖ్యమంత్రి రేవంత్ స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో కరెంటు, నీళ్ల కోసం రైతులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారని, వారికి మీరిచ్చే సమాధానం ఏంటి? అని సీఎం రేవంత్ ను ప్రశ్నించారు హరీశ్ రావు. ప్రతిపక్షాల గొంతులు నొక్కడం, కేసులు, అరెస్టులు, సస్పెన్షన్లపైనే రేవంత్ ఫోకస్ పెట్టారని మండిపడ్డారు.

కరెంటు ఉండి కరెంటు ఇవ్వలేని చేతగానితం ప్రభుత్వం, నీళ్లు ఉండి నీళ్లు ఎత్తలేని దద్దమ్మ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు. నీళ్లు ఎత్తగలిగే అవకాశం ఉన్నా మోటార్లు బంద్ పెట్టారని హరీశ్ ఆరోపించారు. సీఎం రేవంత్ కు బరువు లేదు, బాధ్యత లేదు.. ఆయన బాగుండాలి, ఆయన గురువు బాగుండాలి అంతే.. అంటూ విమర్శలు గుప్పించారు.

#Harish Rao#Brs#Congress#Irriagation#Water#Current#Farmers#Cm Revanth Reddy#Krishna Water#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి