సినిమా

Ramayana: రావణాసురుడిగా ప్రభాస్..'No' ఛాన్స్!

4 నిమిషాల పఠనం

Ramayana: నందమూరి తారకరామారావు అప్పట్లో ఏ పాత్ర చేయాలన్నా వెనకడుగు వేసేవారు కాదు. ఆయనే రాముడు..ఆయనే రావణాసుడు..ఆయనే భీముడు..ఆయనే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామీ. ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ఆబాలగోపాలాన్ని అలరించారు. కానీ, ఆ తర్వాత జనరేషన్‌లో అలాంటి సాహసం ఏ హీరో చేయడం లేదు. ప్రభాస్‌కి రావణాసుడి పాత్ర అవకాశం వచ్చిన సున్నితంగా తిరస్కరించాడు.

Ramayana: నందమూరి తారకరామారావు అప్పట్లో ఏ పాత్ర చేయాలన్నా వెనకడుగు వేసేవారు కాదు. ఆయనే రాముడు..ఆయనే రావణాసుడు..ఆయనే భీముడు..ఆయనే పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామీ. ఇలా ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి ఆబాలగోపాలాన్ని అలరించారు. కానీ, ఆ తర్వాత జనరేషన్‌లో అలాంటి సాహసం ఏ హీరో చేయడం లేదు. ప్రభాస్‌కి రావణాసుడి పాత్ర అవకాశం వచ్చిన సున్నితంగా తిరస్కరించాడు.

ప్రస్తుతం, మన ఇండియన్ సినిమా దగ్గర ఎక్కడ చూసినా రామాయణ సినిమా గురించే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి, రావణాసురుడిగా యశ్, మండోదరిగా కాజల్ అగర్వాల్, శూర్పణఖ పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్ నటించడం ఆసక్తికరంగా మారింది.

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. వాస్తవానికి రామాయణ సినిమాలో రావణాసురుడి పాత్రకు ముందుగా ప్రభాస్‌ను అనుకున్నారట. అదే నిజమైతే ప్రభాస్ ఈ పాత్రను ఒప్పుకునేవారా? అనేది ఆయన అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 చిత్రాలలో విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న ప్రభాస్ రావణ్ పాత్రలో అంటే మంచి ప్రయోగమే. కానీ, ఎందుకు ఆయన ఒప్పుకోలేదన్నదే హాట్ టాపిక్.

రావణ పాత్రకి ప్రభాస్ పేరు ఎందుకు?

డార్లింగ్ ప్రభాస్‌కు పాన్ ఇండియా స్థాయిలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమాలతో ఆయన ఇమేజ్ దేశవ్యాప్తంగా విస్తరించింది. అలాంటి ప్రభాస్‌ను రావణుడి పాత్రలో చూడటం కూడా ఆసక్తికరమైన విషయమే. ముఖ్యంగా, భారీ శరీరాకృతి, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ ఇమేజ్ ఉన్న ప్రభాస్‌కు రావణాసురుడి పాత్రలో మంచి అవకాశం ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కానీ, ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఆదిపురుష్ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటించాడు. మళ్ళీ, రామాయణలో రావణ్ పాత్ర అంటే ప్రేక్షకులు ఎలా భావిస్తారో? అన్న సందేహాలే ప్రభాస్‌ను ఒప్పుకోనీయకుండా చేశాయట. కానీ, యష్ పోషించిన రావణ్ పాత్రను గనక ప్రభాస్ చేసి ఉంటే ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద లెక్కలు వేరేలా ఉండేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఇలాంటి గొప్ప అవకాశం యష్ లాంటి మంచి నటుడికి దక్కడం కూడా అదృష్టమే.

#Ramayana#Prabhas#Nithish Tiwari#Yash#Ranbeer Kapoor#Sai Pallavi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి