Tollywood: ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్‌ను ఆపేస్తారా? అవును..ప్రస్తుతం ఫిలిం సర్కిల్స్‌లో ఇదే మాట బలంగా వినిపిస్తోంది. దీనికి, కారణాలు చాలానే కనిపిస్తున్నాయి. ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆదర్శకుటుంబం సినిమా భారీ నష్టాలపాలవడం ఒకటైటే..ఇదే కాన్సెప్ట్‌తో ఇతర భాషల్లో ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చి ఉండటం. అందుకే, ఇప్పుడు ఈ భారీ ప్రాజెక్ట్ ఉండనే మాట వినిపిస్తోంది.
ఆదర్శకుటుంబం ఎఫెక్ట్:
త్రివిక్రమ్, వెంకటేష్ కాంబినేషన్‌లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఆదర్శకుటుంబం ప్రేక్షకులను మెప్పించలేకపోయిందనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకరకంగా, ఇది నిజం కూడా. మొదటిరోజునుంచే ఈ సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది. అంతకముందు వచ్చిన బ్లాస్ట్ సినిమాలా ఉందనే కామెంట్స్ వినిపించాయి. ఈ రెండు సినిమాలకి కొరియన్ సినిమా ఆధారం అని చెప్పుకున్నారు. అదీకాక, బ్లాస్ట్ సినిమా వచ్చాక..ఆదర్శకుటుంబంలో చాలా మార్పులు చేసి మళ్ళీ రీషూట్ చేశారట.
దీనివల్ల, 60 నుంచి 70 కోట్లలోపు పూర్తవ్వాల్సిన సినిమా ఏకంగా 130 కోట్ల వరకూ పెరగడం. ఇలా బడ్జెట్ రెట్టింపు కావడం..ఆశించిన స్థాయిలో లాభాలు రాకపోవడం వల్ల ఆ ప్రభావం ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ మీద పడిందనే మాట వినిపిస్తోంది. పైగా, ఈ సినిమాకి బడ్జెట్ దాదాపు 500 కోట్ల వరకూ అవుతుందని అంచనాలున్నాయి. హారిక అండ్ హాసిని వారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత భారీ బడ్జెట్ పెట్టేలా లేరట.
అంతేకాదు, ఎన్టీఆర్, త్రివిక్రమ్‌ల గట్టి నిర్ణయం మీదే గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. కానీ, ఈ మధ్య త్రివిక్రమ్ కథల్లో బలం మాటల్లో పదును, రాసుకున్న పాత్రల్లో కొత్తదనం కనిపించడం లేదు. ఏ సినిమా చూసిన పాత సినిమాలను ఆధారంగా చేసుకొనే..అందరికీ తెలిసిన నవల ఆధారంగానో గురూజీ కథలు తయారు చేసుకుంటున్నాడు. ఆ ప్రభావం త్రివిక్రమ్, తారక్‌ల ప్రాజెక్ట్ మీద పడిందని తెలుస్తోంది. మరి, ఈ సినిమా ఉంటుందా లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచి చూడాలి.


