సినిమా

Kollywood: నయనతారకు దెబ్బ మీద దెబ్బ..2027 అయినా కలిసొచ్చేనా?

4 నిమిషాల పఠనం

Kollywood: లేడీ సూపర్ స్టార్‌గా సౌత్ అండ్ నార్త్‌లో విపరీతమైన పాపులారిటీని తెచ్చుకున్న నయనతారకి ఈ ఏడాది వరుస ఫ్లాపులు వచ్చి దెబ్బ మీద దెబ్బ తగిలింది. 2026 ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని నూతన సంవత్సరాన్ని ప్రారంభించిన నయన్..ఆ తర్వాత మాత్రం ఆ స్వాగ్‌ను కంటిన్యూ చేయలేకపోయింది.

Kollywood: లేడీ సూపర్ స్టార్‌గా సౌత్ అండ్ నార్త్‌లో విపరీతమైన పాపులారిటీని తెచ్చుకున్న నయనతారకి ఈ ఏడాది వరుస ఫ్లాపులు వచ్చి దెబ్బ మీద దెబ్బ తగిలింది. 2026 ప్రారంభంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకరవరప్రసాద్‌గారు మూవీతో బ్లాక్ బస్టర్ అందుకుని నూతన సంవత్సరాన్ని ప్రారంభించిన నయన్..ఆ తర్వాత మాత్రం ఆ స్వాగ్‌ను కంటిన్యూ చేయలేకపోయింది.

యష్ టాక్సిక్‌తో మొదలైన ఎదురుదెబ్బలు..

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన భారీ పాన్ ఇండియా చిత్రం 'టాక్సిక్'. ఇందులో నయనతార కీలక పాత్రను పోషించింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. నయనతార కెరీర్‌లో ఈ సినిమా కూడా నిరాశపరిచిన ప్రాజెక్టుల జాబితాలో చేరింది. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్‌దాస్ రూపొందించిన టాక్సిక్ నిర్మాతలకి ఊహించని నష్టాలను తీసుకొచ్చింది.

ఇక కవిన్‌తో కలిసి నటించిన 'హాయ్' సినిమా కూడా ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం థియేటర్ల నుంచి ఆశించిన వసూళ్లను సాధించలేకపోయింది. దీంతో వరుసగా రెండు సినిమాల ఫలితాలు నయనతారకు నిరాశను మిగిల్చాయి. ఒకరకంగా, హాయ్ అలాగే, భారీ కాస్టింగ్‌తో వచ్చిన టాక్సిక్ సినిమాలను ఒప్పుకోవడం నయన్ చేసిన సాహసమే. కానీ, అది వర్కౌట్ కాలేదు.

మహాశక్తితోనూ మరో ఎదురుదెబ్బ.?

రీసెంట్‌గా బాక్సాఫీస్ వద్ద విడుదలైన 'మహాశక్తి' సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ఈ డివోషనల్ ఫాంటసీ చిత్రానికి తొలి రోజు నుంచే ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. ముఖ్యంగా, తెలుగు మార్కెట్‌లో ఓపెనింగ్స్ చాలా బలహీనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. భారీ బడ్జెట్‌తో రూపొందిన సినిమాకు ఈ స్పందన రావడం నిర్మాతలకు ఆందోళన కలిగించే అంశం. వాస్తవానికి మొదటి భాగం మంచి విజయాన్ని అందుకొని లాభాలను తెచ్చింది. కానీ, సీక్వెల్‌గా వచ్చిన మూకుత్తి అమ్మన్ 2 మాత్రం తీవ్రంగా నిరాశపరిచింది. ఇలా, 2026లో నయన్‌కి దెబ్బ మీద దెబ్బ తగిలింది.

#Nayanthara#2027 Flop Movies#South Actress Nayanthara#Kollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి